Nithya Menen: నిత్యామీనన్ కి ఆ వ్యక్తితో చిన్నప్పుడే పెళ్లయిందా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే అందాల ఆరబోత అనుకునేవారు ఎంతోమంది. కానీ ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లలో అందాల ఆరబోతకు దూరంగా ఉండే అతి తక్కువ మంది హీరోయిన్లలో ఒకరు నిత్యామీనన్. చాలామంది హీరోయిన్స్ రెండు మూడు ఫ్లాప్స్ పడగానే అవకాశాల కోసం అందాల ఆరబోతలతో సోషల్ మీడియాలో ఫొటోస్ రిలీజ్ చేస్తారు. కానీ నిత్యామీనన్ మాత్రం అలా కాదు. కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుంది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ తర్వాత ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, ఇటీవల భీమ్లా నాయక్ వంటి సినిమాలతో ఎంతో మంచి హిట్ అందుకుంది. అయితే నిత్యామీనన్ పై ఇప్పటికే పలు ఆరోపణలు సోషల్ మీడియాలో వినిపించాయి. నిత్య ఓ వ్యక్తిని ఇప్పటికే పెళ్లి చేసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆమె పెళ్లి వార్తలు ఇప్పటికే ఎన్నోసార్లు వైరల్ అయ్యాయి.ఆమె తన పెళ్లి విషయంలో ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా పెళ్లి వార్తలు ఆగడం లేదు. అయితే గతంలో నిత్యాకి చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది అంటూ ఓ వార్త టీవీ ఛానల్ లో గట్టిగా వినిపించింది.

ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిత్యా ఇండస్ట్రీకి రాకముందే పెళ్లయిపోయిందని, ఆ వ్యక్తి స్వయంగా ఆ ఛానల్ వాళ్ళ దగ్గరికి వచ్చి వారి పెళ్లి ఫోటోలు చూపించి బయట పెట్టండి అని చెప్పినట్టు ఆలివర్ అనే వ్యక్తి ఓ టెలివిజన్ చానల్ కి వారి ఫోటోలను ఇచ్చారట. తన సినీ కెరీర్ డెవలప్మెంట్ కోసమే నిత్యా తన పెళ్లిని సీక్రెట్ గా దాచి పెట్టిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక నిత్య పెళ్లి ఫోటోలు చూసి చాలామంది ఆశ్చర్యపోయారట. ఇంత జరుగుతున్నా కూడా నిత్య ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో కొన్ని రోజులు ఈ విషయంపై వైరల్ అయ్యి.. ఆ తరువాత సెలబ్రిటీల విషయంలో ఇటువంటి రూమర్స్ కామన్ అని వదిలేశారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు