SSMB29 Update : మహేష్ మూవీ టైటిల్ మహారాజ్… రెస్పాండ్ అయిన రాజమౌళి టీం

SSMB29 Update : ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ బిగ్గెస్ట్ మూవీ టైటిల్ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. మహేష్ మూవీ టైటిల్ మహారాజ్ అంటూ వస్తున్న రూమర్లపై తాజాగా రాజమౌళి టీం రెస్పాండ్ అయింది. మరి ఇంతకీ చిత్ర బృందం ఈ టైటిల్ గురించి ఇచ్చిన క్లారిటీ ఏంటంటే..

టైటిల్స్ అన్నీ రూమర్లే..

దర్శక దిగ్గజం జక్కన్న, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ల లో రాబోతున్న మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి. మూవీ ఇంకా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగానే రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి మహారాజ్, చక్రవర్తి అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారని గత కొంత కాలంగా పుకార్లు తెగ షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన రాజమౌళి టీం ఈ వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదంటూ కొట్టిపారేసింది. అంటే ఈ మూవీకి ప్రస్తుతం బయట వైరల్ అవుతున్న టైటిల్స్ లో ఏ ఒక్కటి అనుకోలేదని తెలుస్తోంది. మరి ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి రాజమౌళి ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేశారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఎప్పుడెఎప్పుడు జక్కన్న, మహేష్ మూవీ లాంచ్ అవుతుందా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్. ఈ మూవీని ప్రస్తుతం SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుచుకుంటున్నారు.

ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన నిర్మాత

రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కేఎల్ నారాయణ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ మూవీకి 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి దాకా ఇంకా బడ్జెట్ ఎంత అవుతుంది అనే విషయం ఫైనల్ కాలేదని, ఎంత భారీ బడ్జెట్ అయినా పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఇక 15 ఏళ్ల క్రితమే జక్కన్న, రాజమౌళి కాంబినేషన్ అనుకున్నప్పటికీ ఆ కాంబో ఇప్పుడు పట్టాలెక్కిందంటూ మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు నిర్మాత నారాయణ. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు కోసం జక్కన్న హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినప్పటికీ వెళ్లలేదని వివరించారు. కాగా ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగనుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లో విదేశీ నటులు కూడా నటించబోతున్నారని టాక్ నడుస్తోంది. అలాగే సినిమా కోసం సరికొత్త అధునాతన టెక్నాలజీని వాడబోతున్నారనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఇప్పటి దాకా కనిపించని న్యూ లుక్ లో స్క్రీన్ పై మెరవబోతున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు