Pushpa Pushpa Song : ఐకాన్‌ స్టార్‌కి కూడా పెయిడ్ తప్పలేదు… వ్యూస్ పెంచడానికి 10 లక్షలు ఖర్చు

Pushpa Pushpa Song : గత రెండేళ్ల క్రితం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా సౌత్ ఇండియాలోనే కాదు నార్త్ ఇండియాలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్ లో ఎటువంటి ప్రమోషన్స్ చేయకపోయినా సరే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యలమంచి రవి శంకర్, నవీన్ యెర్నేని సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ఇక భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే భారీ తారాగణంతో ఇప్పుడు పుష్ప 2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, టీజర్, ఫస్ట్ సింగిల్ అన్నీ కూడా విపరీతమైన క్రేజ్ ను దక్కించుకున్నాయి. ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

వ్యూస్ కోసం లక్షల్లో ఖర్చు..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది. సాధారణంగా ఏ సినిమా నుంచి అయిన విడుదలైన పాటలైనా సరే ట్రైలర్ అయినా సరే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది అంటే కచ్చితంగా ఆ పాట లేదా ఆ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అయితే కంటెంట్ బాగుంటే వ్యూస్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “పుష్ప పుష్ప పుష్పరాజ్” అనే పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటని యూట్యూబ్లో ట్రెండ్ చేసి వ్యూస్ తెప్పించడం కోసం నిర్మాతలు ఇప్పటివరకు రూ .10 లక్షలు ఖర్చు చేశారట. అంతేకాదు ఇంకా ఖర్చు పెడతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -

అల్లు అర్జున్‌ కూడానా…?

నిజానికి ఈ పెయిడ్ ప్రమోషన్స్ అనేవి చిన్న సినిమాల ప్రమోషన్స్ కంటెంట్ కి నిర్మాతలు వాడుతారు. దీని వల్ల అయినా తమ కంటెంట్ ఆడియన్స్ కు చేరుతుందని వారి ఉద్దేశ్యం. కానీ, పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ కు మాత్రం ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్ అవసరం లేదు. ఒక అల్లు అర్జున్ మాత్రమే కాదు… ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టైర్ 1 హీరోలు ఎవరికీ కూడా ఈ పెయిడ్ ప్రమోషన్స్‌తో పని లేదు. కానీ, ఎంతో హైప్ ఉన్న పుష్ప 2 మూవీకి అందులోనూ టైటిల్ సాంగ్ కు పెయిడ్ ప్రమోషన్స్ పెట్టడంతో… నిర్మాతలకు సినిమాపై గానీ, సాంగ్ పై గానీ నమ్మకం లేదనే వాదన వినిపిస్తుంది.

నిర్మాతలకి ఫ్యాన్స్ కౌంటర్..

ముఖ్యంగా యూట్యూబ్లో వ్యూస్ పెరిగితే రికార్డు సృష్టించవచ్చు అనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ నిర్మాతలు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే వ్యూస్ పెరగడానికి కంటెంట్ పై ఆధారపడకుండా.. ఇలా లక్షలు పోసి వ్యూస్ పెరిగేలా చేయడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు ఈ విషయంలో నిర్మాతలు విమర్శలు ఎదుర్కొంటున్నారు.. బన్నీపై మాకు నమ్మకం ఉంది .. ఆయన సినిమా ఖచ్చితంగా రికార్డు సృష్టిస్తుంది. మీరు ఇలాంటి చెత్త ప్రయత్నాలు ఏవి చేయకండి అంటూ కౌంటర్లు వేస్తూ ఉండడం గమనార్హం..

అల్లు అర్జున్ సినిమాలు…

Allu Arjun Pushpa The Rule
Allu Arjun Pushpa The Rule

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా తర్వాత మళ్లీ అలవైకుంఠపురంలో కాంబో రిపీట్ కానున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఈయన సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు