టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సమంత అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది. అన్ని వేరియేషన్స్ లో నటించగల నటి సమంత. చేతి నిండా సినిమాలతో సమంత ప్రస్తుతం బిజీగా మారిపోయింది. సమంత నటించిన యశోద, శకుంతలం సినిమాలు అతి త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది సామ్. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే, సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన అనంతరం సమంతపై అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సమంత పై అక్కసు వెళ్ళగక్కారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా, తన పని తాను చేసుకుంటూ పోతోంది.
ఈ తరుణంలోనే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించి, తనలోని వేడి ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది సమంత. ఇలా హీరోయిన్ గా, ఐటమ్ సాంగ్ బ్యూటీగా సమంత దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ పాత్ర చేసేందుకు కూడా సమంత సన్నద్ధమైనట్లు సమాచారం అందుతుంది. సమంత త్వరలోనే విలన్ పాత్ర చేయనున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్త వైరల్ అవుతుంది. తమిళ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు అనే సినిమా తీస్తున్నాడు. దీని తర్వాత లోకేష్ కనగరాజు దర్శకత్వంలో చేయనున్నాడు.
లోకేష్-విజయ్ సినిమాపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, కోలీవుడ్ లో చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, థలపతి67 సినిమాలో సమంత నటిస్తుందని తెలుస్తోంది. అయితే, అది హీరోయిన్ పాత్ర కాకుండా, విలన్ రోల్ అని టాక్. విలన్ పాత్రలో సమంతానే బాగా సెట్ అవుతుందని చిత్ర బృందం భావిస్తుందట. ఇందులో భాగంగానే త్వరలోనే దీనిపై సమంతను చిత్ర బృందం కలవనుందట. అయితే ఈ పాత్రకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. కాగా విజయ్ తో సమంత ఇప్పటికే, కత్తి, తెరి, మెర్సల్ సినిమాల్లో నటించిన సంగతి విధితమే.