తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం “వారిసు”. తెలుగులో “వారసుడు” గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమా బృందం విడుదల చేసింది.
అలాగే హీరో విజయ్ సరసన టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ రెండు గెటప్స్ లో కనిపిస్తున్నట్లు సమాచారం. ఒకటి కాలేజీ కుర్రాడిగా అయితే, మరొక గెటప్ లో బిజినెస్ మెన్ గా దర్శనం ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాలలో చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర సెట్ అయినట్లు తాజాగా టాక్ వినిపిస్తోంది.
ఈ వారసుడు సినిమాలో ఎస్ జె సూర్య ఓ కీలక పాత్ర చేస్తున్నారట. ఎంపిక దాదాపు ఖరారు అయిపోయిందని టాక్. కీలక పాత్ర అంటే, విలన్ పాత్ర అని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. కానీ, ఎస్.జే సూర్యను విలన్ పాత్రలో వంశి పైడిపల్లి చూపిస్తాడా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మెయిన్ విలన్ గా పెడతాడా లేదా సినిమాలో ఓ చిన్న నెగిటివ్ రోల్ తో సరిపెడితాడా అని తెలియాల్సి ఉంది. చిన్న నెగిటివ్ రోల్ లో ఎస్.జే సూర్య కనిపిస్తే, మరి మెయిన్ విలన్ ఎవరు అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే, వారసుడు సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
మరోవైపున రామ్ చరణ్ – శంకర్ సినిమాలోనూ విలన్ గా ఎస్ జె సూర్య పేరే వినిపిస్తోంది.