Ramarao On Duty : రవితేజ కోసం నేచురల్ స్టార్

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ”రామారావు ఆన్ డ్యూటీ” అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ శరత్ మండవ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీలక పాత్రలో వేణు తొట్టెంపూడి నటించాడు. ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. కాగ ఈ సినిమా ఈ నెల 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. దీని కోసం చిత్ర బృందం ప్రమోషన్ పనులను ప్రారంభించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ విడుదల అయ్యాయి.

తాజాగా ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకోబోతుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఈ రోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ కోసం చిత్ర బృందం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని హాజరుకాబోతున్నాడు. ఈ విషయాన్ని ”రామారావు ఆన్ డ్యూటీ” నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దీంతో నేచురల్ స్టార్ నాని, మాస్ మహారాజ రవితేజ ఈ రోజు ఒకే వేదిక పై సందడి చేయనున్నారు. కాగ, నాని ఇటీవల ”అంటే సుందరానికీ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన కలెక్షన్లు మాత్రం రాలేదు. నాని ప్రస్తుతం ”దసరా” అనే సినిమా చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు