Met Gala 2024 : ఈసారి మెట్ గాలాలో ప్రియాంక, దీపికా మిస్… ఎందుకంటే?

Met Gala 2024 : ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మెట్ గాలా ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కానీ ఈ వేడుకలో ఈసారి గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే మిస్ అయ్యారు. మరి వీళ్ళు ఈవెంట్ ను స్కిప్ చెయ్యడానికి కారణం ఏంటి? అంటే…

ప్రతి సంవత్సరం మేలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్ గాలా అనే ఫ్యాషన్ ఈవెంట్ జరుగుతుంది. వివిధ దేశాలకు చెందిన దిగ్గజ నటులు, నటీమణులు, గాయకులు, మ్యూజిక్ డైరెక్టర్స్, క్రీడాకారులు, మోడల్స్ వినూత్నమైన దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ ఈవెంట్ కోసం వారు వేసుకున్న దుస్తులే కొన్ని రోజులు హాట్ టాపిక్ గా మారతాయి. ఆ విధంగా ఈ ఏడాది కూడా మెట్ గాలా మొదలైంది.

అసలు ఏంటి ఈ మెట్ గాలా?

మెట్ గాలా అనేది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ కోసం నిధులను సేకరించడానికి యూఎస్ఏ లోని న్యూయార్క్‌లో ప్రతి సంవత్సరం మేలో నిర్వహించబడే ఫ్యాషన్ ఈవెంట్. సాయంత్రం ప్రారంభమై అర్ధరాత్రి వరకు పలువురు అక్కడికి వచ్చిన ప్రముఖులు సరికొత్త ఫ్యాషన్‌ లతో రెడ్ కార్పెట్‌పై నడుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి సెలబ్రిటీలు ఒకే షోలో పాల్గొనడానికి రావడంతో ఈ షోను చూసేందుకు అభిమానులు ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.

- Advertisement -

మెట్ గాలా 2024లో అలియానే హైలెట్

ఈ ఈవెంట్ కోవిడ్ కారణంగా 2020లో రద్దు అయ్యింది. ఈ సంవత్సరం మెట్ గాలా ఈరోజు ప్రారంభమైంది. ఇందులో ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, అలియా భట్ తదితరులు పాల్గొనడం గమనార్హం. సబ్యసాచి చీర కట్టుకున్న అలియా భట్ అభిమానులను, ఈవెంట్ కు హాజరైన ప్రముఖులను ఆకట్టుకుంది.

అదేవిధంగా ఇషా అంబానీ చీర, గౌను స్టైల్ దుస్తులను ధరించి కనిపించారు. అలాగే ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా వెలుగొందుతున్న మోనా పటేల్ కూడా ఇందులో పాల్గొంది. ఆమె దుస్తులను చూసి ఇతర ప్రముఖులు నోరు వెళ్లబెట్టారు అని చెప్పవచ్చు. ఆమె సీతాకోక చిలుక ఆకారపు గౌను ధరించింది.

స్కిప్ చేసిన సెలబ్రిటీలు

దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా ఈ సంవత్సరం మెట్ గాలాకు హాజరవుతారని చాలా మంది ఎదురు చూశారు. ఎందుకంటే గత ఏడాది జరిగిన మెట్ గాలాలో వారిద్దరూ ధరించిన దుస్తులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అయితే అంచనాలకు భిన్నంగా ఈ ఏడాది జరిగిన మెట్ గాలాకు వీరిద్దరూ హాజరుకాకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న ప్రియాంక, మరోవైపు తల్లి కాబోతున్నందున దీపికా ఈ ఏడాది మెట్ గాలాకు హాజరుకాలేదని తెలుస్తోంది.

టిక్కెట్ కాస్ట్ ఎంతో తెలుసా?

గతేడాది మెట్ గాలా టిక్కెట్ల ధర 50,000 డాలర్స్ గా ఉండేది. భారతీయ కరెన్సీ ప్రకారం 41 లక్షల రూపాయలు. దీంతో గతేడాది జరిగిన మెట్ గాలాకు కొందరు సెలబ్రిటీలు హాజరు కాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మెట్ గాలా టికెట్ ధరను 75,000 డాలర్లకు పెంచారు. రూపాయిలలో లెక్కేస్తే దాదాపు 62 లక్షల రూపాయలు కావడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు