Varisu : విజయ్ పోషించే పాత్ర అదేనట ?

తమిళ స్టార్ హీరో విజయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరో విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి ట్రాక్ లో ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో హీరో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు “వారసుడు” అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషలలో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్ లో “వరిసు” గా రిలీజ్ కానుంది.

మరి శరవేగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే విజయ్ దళపతి తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాపై రోజుకో రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, ఈ మూవీలో విజయ్ పాత్రకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో వార్త జోరుగా చెక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో విజయ్ లుక్స్ పరంగా చాలా యంగ్ గా కనిపిస్తుండటంతో ఆయన రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో విజయ్ కాలేజీ కుర్రాడిగా, ఆ తర్వాత ప్రెజెంట్ సీన్స్ లో ఓ ఫుడ్ కంపెనీ బాస్ గా విజయ్ కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పాత్రలలో విజయ్.. తన వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేటట్లుగా చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు