Sandalwood: అసభ్యకర కామెంట్స్… కాస్టింగ్ డైరెక్టర్ పై నటి కంప్లైంట్

Sandalwood : సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనేది అత్యంత సాధారణమైన పరిస్థితిగా మారింది. గతంలో ఇలా ఇండస్ట్రిలో లైంగిక వేధింపులను తట్టుకోలేక ఆల్రెడీ అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కున్న వారు మీటూ అంటూ తమ గళాన్ని విన్పించారు. అప్పటి నుంచి ఎక్కడో ఒక చోట తరచుగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కన్నడ చిత్రసీమలో మళ్లీ అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

పోలీస్ లకు నటి కంప్లైంట్

సినిమాలో అవకాశం ఇస్తానని సూర్య అనే దర్శకుడు తనను ఇబ్బనులకు గురి చేశాడని ఆరోపించింది కన్నడ నటి అమూల్య గౌడ. ఇప్పటిదాకా పలు సీరియల్స్ లో నటించిన ఆమె తాజాగా ఇలా లైంగిక వేధింపుల కారణంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఆమె బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆడిషన్ పేరుతో అసభ్యకరమైన మెసేజ్ లు…

ఆడిషన్‌ కు పిలుస్తాననే నెపంతో నటి అమూల్యకు అతడు అసభ్యకరమైన సందేశాలు పంపినట్టు సమాచారం. సూర్య అనే వ్యక్తి వాట్సాప్‌లో తనకు హానికరమైన, అసభ్యకరమైన సందేశాలు పంపారని అమూల్య గౌడ ఫిర్యాదులో ఆరోపించారు. ఏప్రిల్ 30న అమూల్య గౌడ తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై అవమానకరంగా స్పందించినట్లు కంప్లైంట్ చేసింది ఆమె. దానిని ప్రశ్నించినందుకు ఏ పోలీసుకు చెప్పుకుంటావో చెప్పుకో అంటూ అతను నటిని తిట్టినట్టు సమాచారం. అతని తీరుతో విసిగిపోయిన నటి అమూల్య పోలీసులను ఆశ్రయించింది.

- Advertisement -

రాత్రంతా కాల్స్, మెసేజులు..

నటికి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్య తాను కాస్టింగ్ డైరెక్టర్ అని పేర్కొన్నాడు. తనను ఆడిషన్‌కు రావాల్సిందిగా కోరుతూ అసభ్యకరమైన సందేశాలు పంపారంటూ అమూల్య గౌడ ఫిర్యాదు చేసింది ఇతని పైనే. రాత్రంతా అతను చేసిన మెసేజ్‌లు, కాల్స్‌తో విసిగిపోయిన ఈ నటి ఇప్పుడు చట్టం ద్వారా బుద్ది చెప్పేందుకు సిద్ధమైంది.

పోలీసుల కస్టడీలో సూర్య

అతన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించాలంటూ ఫిర్యాదులో నటి అమూల్య అభ్యర్థించింది. మొదట్లో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకోలేదు. అయితే సూర్య అనే వ్యక్తి ప్రవర్తన భరించరానిదిగా ఉండడంతో తాజాగా అతడిని గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. మరి పోలీసులు అమూల్య రిక్వెస్ట్ మేరకు అతనికి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా? లేదంటే కేసు నమోదు చేస్తారా? అనేది చూడాలి.

అమూల్య ఫ్యాన్స్ ఫైర్

ఇప్పటికే అమూల్య గౌడ చాలా సీరియల్స్‌లో నటించింది. ఆమె ఇలా వేధింపులకు గురైందని, పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలియడంతో నెటిజన్లు నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాండల్‌వుడ్‌లో మీటూ తర్వాత కాస్టింగ్ కౌచ్ కేసులు ఎక్కువయ్యాయి. నిందితులను వెంటనే విచారించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాంటి వాటిని ఇంకా భరించాల్సిన అవసరం లేదని, ఇలా అసభ్యకరంగా ప్రవర్తించే వారికి బుద్ధి చెప్పాలంటూ అమూల్యకు మద్ధతునిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు