Alluri Sitaramaraju Death Anniversary : వెండితెర “అల్లూరి సీతారామరాజు”గా మెప్పించిన నటులు ..!

Alluri Sitaramaraju Death Anniversary : భారత దేశ స్వాతంత్రోద్యమంలో పోరాడి ప్రాణాలర్పించిన వీరుల్లో తెలుగువారి గురించి చెప్పుకుంటే అందరికీ ముందు గుర్తొచ్చేది “అల్లూరి సీతారామరాజు”. మన్యం వీరుడిగా గిరిజనులతో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ ఆరాధ్యనీయుడు. అలుపెరగని పోరాట పటిమతో విజయం దిశగా వెళ్తున్న సీతారామరాజు, బ్రిటిష్ వారు తన కోసం ప్రజల్ని చిత్ర హింసలు పెట్టడం తట్టుకోలేక వారికి లొంగిపోయి అమరుడయ్యాడు. ఈనాడు మహనీయుడి వర్ధంతి (Alluri Sitaramaraju Death Anniversary) (మే7 1924). ఈ సందర్భంగా ఆ పోరాటయోధుడ్ని గుర్తు చేసుకుంటూ, వెండితెరపై “అల్లూరి సీతారామరాజు” గా నటించి మెప్పించిన కథానాయకులెవరో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ : అల్లూరి సీతారామరాజు(1974)

krishna as alluri sitarama raju
krishna as alluri sitarama raju

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ‘అల్లూరి సీతారామరాజు’ నటశేఖర కృష్ణ అనే అంటారు ఎవరైనా. తెరపైకి మొట్ట మొదటిసారిగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను సినిమాగా మలిచింది కృష్ణ. 1974 వి. రామచంద్ర రావు దర్శకత్వం లో, కృష్ణ సొంత బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో అద్భుతంగా నటించి మెప్పించారు కృష్ణ. నిజంగా అల్లూరి సీతారామరాజు అంటే ఇలాగే ఉండేవాడు అనుకునేవారు సినీ ప్రియులు. చాలా మంది ఈ బయోపిక్ తీస్తున్నప్పుడు కృష్ణ ని వద్దని వారించగా, సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ తప్ప ఆ రోల్ ఎవ్వరు చేయరని అన్నారు. ఆరోజుల్లోనే ఈ సినిమా 2కోట్లకి పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం.

ఎన్టీ రామారావు : మేజర్ చంద్రకాంత్(1993)

NT Ramarao as alluri sitarama raju
NT Ramarao as alluri sitarama raju

నందమూరి తారక రామారావు నటించిన “మేజర్ చంద్రకాంత్” చిత్రంలో ఒక పాటలో ఒక నిమిషంన్నర పాటు అల్లూరి సీతారామరాజు గా కనిపించడం జరుగుతుంది. నిజానికి కృష్ణ కంటే ముందే ఎన్టీఆర్ అల్లూరి బయోపిక్ తీద్దామనుకున్నారు. అప్పట్లో డైరెక్ట్ గా కృష్ణ ని ఆ సినిమా తనకి సెట్ అవదని, ప్రముఖ నిర్మాతలతో ఎన్టీఆర్ చెప్పించారు. కానీ అంతలోనే కృష్ణ సినిమా తీసేసారు. ఈ సినిమాపై అనేక రాజకీయాలు జరగగా, ఎన్టీఆర్ కృష్ణ మధ్య విభేదాలు ఇక్కడి నుండే మొదలయ్యాయని అంటుంటారు.

- Advertisement -

మహేష్ బాబు : ముగ్గురు కొడుకులు(1988)

Mahesh babu as alluri sitarama raju
Mahesh babu as alluri sitarama raju

మహేష్ బాబు కూడా అల్లూరి సీతారామరాజు పాత్రలో కాసేపు కనిపించడం జరిగింది. కానీ చాలా మందికి తెలియదు. అయితే అది హీరోగా కాదు. తండ్రి కృష్ణ హీరోగా నటించిన “ముగ్గురు కొడుకులు” చిత్రంలో ఒక నాటకం వేసే సీన్ లో మహేష్ బాబు అల్లూరి సీతారామరాజు గా కాసేపు కనిపించి మెప్పించాడు. ఆ సీన్ లో గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పి శభాష్ అనిపించాడు.

బాలకృష్ణ: ఎన్టీఆర్ బయోపిక్ (2019)

Balakrishna as alluri sitarama raju
Balakrishna as alluri sitarama raju

నందమూరి బాలకృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ గా తీసిన కథానాయకుడు లో మేజర్ చంద్రకాంత్ లో అల్లూరి సీన్ ని రిపీట్ చేస్తూ బాలయ్య కాసేపు అల్లూరి సీతారామరాజు గా కనిపించడం జరిగింది. అయితే ఈ సినిమా ప్లాప్ అయింది. అయితే దీనికి ముందు కూడా భారతంలో బాలచంద్రుడు’, విజయేంద్ర వర్మ సినిమాల్లో కూడా కొన్ని క్లిప్స్ లో బాలయ్య అల్లూరిగా కనిపించారు.

రామ్ చరణ్: RRR (2022)

Ram Charan as alluri sitarama raju
Ram Charan as alluri sitarama raju

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ RRR లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజు పాత్రకి ఫిక్షనల్ కథను జోడించి రాజమౌళి తెరక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. మొదటి తరం లో అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ అనే ప్రేక్షకులు, ఈ జెనరేషన్ లో అల్లూరి అంటే రామ్ చరణ్ అనే అంటున్నారు. అంతగా ఆ పాత్రలో నటించి మెప్పించాడు రామ్ చరణ్.

అయినా “అల్లూరి సీతారామరాజు” పాత్ర చెయ్యాలంటే అంత ఆషామాషీ కాదు. ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యత అలాంటిది మరి. వీరే కాక ఆ 1950 లో ఆలు మగలు చిత్రంలో కళా వాచస్పతి జగ్గయ్య కూడా అల్లూరి పాత్రలో ఓ పాటలో కనిపించారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు