Chiranjeevi : మళ్లీ రాజకీయం… తమ్ముడికి సపోర్ట్‌గా కీలక అనౌన్స్‌మెంట్..!

Chiranjeevi.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.. ఈ కుటుంబంలో ఎంతమంది హీరోలు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి కొన్ని కారణాల చేత మళ్లీ పొలిటికల్ కు దూరమై సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చారు.. కానీ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఒక వైపు సినిమాలు మరొకవైపు తను స్థాపించిన జనసేన పార్టీ కోసం సాయశక్తులా పోరాడుతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినా..విజయాన్ని మాత్రం అందుకోలేకపోతున్నారు.

Chiranjeevi : Politics again... Key announcement in support of younger brother..!
Chiranjeevi : Politics again… Key announcement in support of younger brother..!

పవన్ కళ్యాణ్ కి ఓటు వేయండి అంటున్న చిరంజీవి..

గతంలో నిలబడిన రెండు చోట్ల కూడా ఓడిపోవడంతో ఈసారి తను ఎలాగైనా గెలవాలని పిఠాపురం నియోజవర్గాన్ని ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్.. తను గెలవాలనే కోరికతో ఎంతోమంది సీని సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది ఇప్పటికే పిఠాపురంలో ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు.. తాజాగా ఇప్పుడు చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఓటు వేయండి అంటూ వెల్లడించారు.. తన తమ్ముడు సినిమా ఇండస్ట్రీలోకి చాలా బలవంతంగా వచ్చారు కానీ రాజకీయాలలోకి ఇష్టంగానే ఎంట్రీ ఇచ్చారని వెల్లడించారు.

సొంత డబ్బుతో రైతులకు సాయం..

సామాన్యంగా ఎవరికైనా అధికారం వచ్చిందంటే ప్రజలకు సహాయం చేస్తారని.. కానీ తన తమ్ముడు మాత్రం కేవలం తన దగ్గర ఉండే డబ్బులతో ఎంతోమంది రైతులను ఆదుకున్నారు అని తన తమ్ముడి లాంటి నాయకుడే ప్రజలకు కావాలని వెల్లడించారు.. ఎవరికైనా సరే అనరాని మాటలు అంటే చాలా బాధగా ఉంటుంది.. తన తమ్ముడిని కూడా తిడుతూ ఉంటే.. చాలా బాధగా అనిపిస్తుంది అంటూ చిరంజీవి వెల్లడించారు. ఈ విషయం పైన తన తల్లి కూడా బాధపడుతూ ఉంటే.. ఒకే మాట చెప్పానంటూ వెల్లడించారు..

- Advertisement -

తన తమ్ముడిని గెలిపించాలంటూ అభ్యర్థన..

ఎంతోమంది తల్లుల కోసం బిడ్డల కోసం చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో మనం బాధ పెద్దది కాదంటూ చిరంజీవి వెల్లడించారు.. తన తమ్ముడిని చట్టసభలకు పంపించాలంటూ పిఠాపురం ప్రజలను కోరుకుంటూ జనసేన పార్టీకి ఓటు వేయండి అంటూ ఒక వీడియో ద్వారా ట్విట్టర్ నుంచి పోస్ట్ చేశారు చిరంజీవి.. తన తమ్ముడు తన కుటుంబం కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని.. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ తన తమ్ముడు మాత్రం తన సొంత ఖర్చుతోనే ఎంతోమందికి సహాయం చేశారని వెల్లడించారు.

చిరంజీవి దెబ్బకు కూటమి షాక్..

పిఠాపురం ప్రజలకు మీ సేవకుడిగా సైనికుడిగా ఉంటారు.. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అంటూ చిరంజీవి ఈ వీడియో ద్వారా వెల్లడించారు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే కూటమి విషయంలో మాత్రం చిరంజీవి ఎక్కడ ఏమీ మాట్లాడలేదు.. కేవలం తన తమ్ముడిని సపోర్టు చేస్తూ అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు.. ఈ విషయం అటు కూటమి అభ్యర్థులను ఆశ్చర్యపరిచేలా కనిపిస్తోందని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ప్రచారంలో చిరంజీవి షెడ్యూల్ ఇదే..

ఇక ఎలక్షన్స్ లో భాగంగా చిరంజీవి షెడ్యూల్ విషయానికి వస్తే.. మే 10న విజయవాడ కు చిరంజీవి చేరుకోనున్నారు.. ఆ తర్వాత మే 11న టిడిపి అధినేత చంద్రబాబుతో మీటింగ్ నిర్వహించనున్నారు .. అదే రోజు ప్రతినిధి 2 మూవీ స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించబోతున్నట్లు సమాచారం.మే13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు నుంచి ప్రచారాలు చేయడం నిషిద్ధం. ఇక ఏపీలో ప్రచారానికి చివరి తేదీ మే 11 కావడంతో అదే రోజు సాయంత్రం చిరంజీవి పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు