Met Gala 2024 : 83 కోట్ల కాస్ట్లీ డ్రెస్… మెట్ గాలా ఈవెంట్‌లో మెరిసిన తెలుగు అమ్మాయి

Met Gala 2024 : మెట్ గాలా 2024 ఈవెంట్ మే 6న గ్రాండ్ గా జరిగింది. భారత కాలమాన ప్రకారం మెట్ గాలా ఈవెంట్ మంగళవారం ఉదయం స్టార్ట్ అయ్యింది. మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ గ్రాండ్ ఫ్యాషన్ ఈవెంట్ న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్, ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి హాజరయ్యే ప్రముఖులు రెడ్ కార్పెట్ పై హొయలు పోతున్నారు.

రూ. 83 కోట్ల డ్రెస్ లో మెరిసిన తెలుగమ్మాయి

ఈ వేడుకలో సెలబ్రిటీలు ప్రపంచంలోనే సక్సెస్ ఫుల్ ఫ్యాషన్ డిజైనర్లు డిజైన్ చేసిన దుస్తువులను వేసుకుని రెడ్ కార్పెట్ పై ఫోటోలను పోజులు ఇస్తారు. వాటి ఖరీదు కూడా కోట్లలోనే ఉంటుంది. తాజాగా ఓ తెలుగు అమ్మాయి మెట్ గాలా 2024 ఈవెంట్ లో ఏకంగా 10 మిలియన్ డాలర్లు విలువైన డ్రెస్ ను ధరించి కన్పించింది. అంటే ఇండియన్ రూపాయిలలో ఆ డ్రస్ ధర ఏకంగా రూ. 83 కోట్లు.

గాలాలో సుధా రెడ్డి యాక్ససరీస్ లక్షల్లోనే..

వ్యాపారవేత్త అయిన సుధా రెడ్డి సోమవారం మెట్ గాలాలో రెండవసారి కనిపించారు. ఈ యంగ్ వ్యాపారవేత్త మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మిషన్‌తో చేతులు కలిపి ఆ వేడుకలోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సుధా రెడ్డి మెట్ గాలా ఈవెంట్ లో ఈసారి 180 క్యారెట్ల 30 సాలిటైర్‌లతో కూడిన వారసత్వ హారంతో పాటు బెస్పోక్ తరుణ్ తహ్లియాని డ్రెస్ ధరించి కన్పించింది. సుధా రెడ్డి $40,000 డాలర్ల కంటే ఎక్కువ ఖరీదు చేసే పాతకాలపు చానెల్ బ్యాగ్‌ తో తన లుక్ ను పూర్తి చేసింది. ఆ బ్యాగ్ ధర ఇండియన్ రూపీస్ లో అక్షరాలా రూ. 33 లక్షలు. వాస్తవానికి సుధా రెడ్డి బృందానికి ఆమె లుక్ ను క్రియేట్ చేయడానికి సుమారు $10 మిలియన్లు అంటే రూ. 83 కోట్లు ఖర్చవుతుందని సమాచారం.

- Advertisement -

సుధా రెడ్డి ఎవరు?

సుధా రెడ్డి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్. సుధా రెడ్డి ఫౌండేషన్, యునిసెఫ్, గ్లోబల్ గిఫ్ట్ ఫౌండేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఫైట్ హంగర్ ఫౌండేషన్, యాక్షన్ ఎగైనెస్ట్ హంగర్ ద్వారా విస్తృతమైన దాతృత్వ కార్యక్రమాలకు తనను తాను అంకితం చేసుకున్నారు. ఈ సంవత్సరం మెట్ గాలాకు హాజరైన కొద్ది మంది భారతీయులలో సుధా రెడ్డి కూడా ఒకరు. ఆమె 2021లో ఫ్యాషన్స్ బిగ్గెస్ట్ నైట్ కార్పెట్‌ అనే ఈవెంట్ ద్వారా రెడ్ కార్పెట్ అరంగేట్రం చేసింది.

మెట్ గాలా 2024 లక్ష్యం..

మెట్ గాలా అనేది ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యధికంగా సందర్శించే ఆర్ట్ మ్యూజియం. దీని లక్ష్యం ఏంటంటే ప్రజల విద్య, ఆనందం కోసం అత్యుత్తమ కళాకృతులను సేకరించడం, సంరక్షించడం, వివరించడం, ప్రదర్శించడం. మెట్ గాలా మ్యూజియం కోసం నిధులను సేకరించేందుకు కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ ప్రతి ఏడాది ఈ వేడుకను నిర్వహిస్తుంది. ఈ వేడుకలో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా పాల్గొంది. ఆమె పిక్స్ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు