Sreeja: విడాకులపై తొలిసారి స్పందన.. క్లారిటీ ఇచ్చినట్టేనా..?

Sreeja.. మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె సెలబ్రిటీ కాకపోయినా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిత్యం వార్తల్లో నిలుస్తోంది.. ముఖ్యంగా మొదట తాను ప్రేమించిన అబ్బాయి కోసం కుటుంబాన్ని ఎదిరించి ఏకంగా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పై పోలీస్ కేసు కూడా పెట్టింది. ఇక తర్వాత అతడితో ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విభేదాలు రావడంతో విడిపోయి బిడ్డతో సహా పుట్టింటికి వచ్చి చేరింది. ఆ తర్వాత అప్పటికే పెళ్లయి విడిపోయిన కళ్యాణ్ దేవ్ ని పెద్దల కోరిక మేరకు వివాహం చేసుకుంది.వీరి ప్రేమ బంధానికి గుర్తుగా మరొక కూతురు కూడా జన్మించింది. అయితే గత కొద్ది రోజులుగా కళ్యాణ్ దేవ్ తో కూడా ఈమె గొడవ పెట్టుకుందని.. అందుకే విడిపోతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి..

Sreeja: The first reaction on divorce.. is it like giving clarity..?
Sreeja: The first reaction on divorce.. is it like giving clarity..?

రూమర్స్ వైరల్..

ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారని కోర్టు శని, ఆదివారాల్లో మాత్రమే తమ కూతురిని కళ్యాణ్ దేవ్ దగ్గర వదిలి పెట్టాలని మిగతా రోజుల్లో శ్రీజా చూసుకోవాలని తీర్పు ఇచ్చిందంటూ కూడా వార్తలు సృష్టించారు. అయితే ఎవరికి వారు పోస్ట్లు పెడుతూ వార్తలను స్ప్రెడ్ చేశారు.. కానీ అటు శ్రీజ ఇటు కళ్యాణ్ దేవ్ ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు.. అయితే తొలిసారి ఈ విషయాలపై స్పందించింది శ్రీజ..

విడాకుల పై క్లారిటీ..

తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ పోస్ట్ చేసింది.. అందులో ఒక అమ్మాయి తన భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది.. కానీ తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వకు అంటూ తన భర్త కోరుతున్నాడంటూ ది యాంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్ కు ప్రశ్న పంపింది.. అంతేకాదు వారు సమాధానం ఇస్తూ ఆయనతో ఉంటే మీరు సంతోషంగా ఉంటారా లేదా అనే ప్రశ్న మీకు మీరు వేసుకోవాలంటూ చెప్పుకొచ్చారు.. ఇక దీనిని స్క్రీన్ షాట్ తీసి శ్రీజ తన ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ గా మారుతోంది. విడాకుల వ్యవహారంపై స్పందిస్తూ.. మీకు మీరే ఆలోచించుకోండి.. బబుల్ బాత్ చేయడం.. స్పా కి వెళ్లడం, మంచి డ్రెస్సులు కొనుక్కోవడం, అందంగా తయారవడం అనేది సెల్ఫ్ లవ్.. సెల్ఫ్ లవ్ వర్సెస్ సెల్ఫ్ కేర్.. మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకు వుందా.. అంటూ శ్రీజ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ ఇంకా విడాకులు తీసుకోలేదు.. కానీ కళ్యాణ్ దేవ్ తో సంతోషంగా ఉండలేకపోవడం వల్లే ఆమెకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా తనను తాను ప్రేమించుకుంటూ తనను తాను జాగ్రత్తగా చూసుకుంటున్నానని ఒక పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు