Suriya and Jyothika Daughter Marks : సూర్య, జ్యోతిక కూతురు ఇంటర్ లో ఎన్ని మార్కులు తెచ్చుకుందో తెలుసా?

Suriya and Jyothika Daughter Marks : తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ కపుల్ సూర్య, జ్యోతిక. వీరి కుమార్తె దియా ఇటీవల ముగిసిన ఇంటర్ పరీక్షలో మంచి మార్కులు సాధించినట్లు సమాచారం. కూతురు ఎక్కువ మార్కులు సాధించడంతో సూర్య కుటుంబమంతా ఆనందంగా ఉందని, ఈ గుడ్ న్యూస్ ను సెలబ్రేట్ చేసుకుంటోందని సమాచారం. మరి స్టార్ కిడ్ దియా ఇంటర్ లో ఎన్ని మార్కులు సాధించింది? అనే వివరాల్లోకి వెళ్తే..

సూర్య కూతురు దియా ఇంటర్ మార్క్స్..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూతురు దియా ఈ ఏడాదే 12వ తరగతి పరీక్ష రాసింది. తాజాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడి కాగా, దియా మార్కులు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో తమిళంలో 100కి 96, ఇంగ్లిష్‌లో 97, అకౌంట్స్‌లో 94, ఫిజిక్స్‌లో 99, కెమిస్ట్రీలో 98, కంప్యూటర్ సైన్స్‌లో 97 మార్కులను దియా సాధించడం విశేషం. దియా ఇంటర్ లో 600 మార్కులకు గాను 581 మార్కులు సంపాదించినట్టు సమాచారం. దియా ఇన్ని మార్కులు సాధించినందుకు కుటుంబ సభ్యులు ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

కూతురు చదువుల తల్లి..

10వ పరీక్షలో కూడా దియా ఇలాగే టాప్ మార్కులు కొట్టేసింది, 500కి 487 మార్కులు సాధించింది. అయితే సూర్య తన పిల్లల చదువుల కోసం తన కుటుంబంతో కలిసి ముంబైలో స్థిరపడినట్టు నెట్టింట్లో ఓ వార్త హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

కొడుకు కరాటే కిడ్

తాజాగా సూర్య కుమారుడు దేవ్ తన స్కూల్లో జరిగిన కరాటే పోటీలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. పిల్లలిద్దరూ చెన్నైలో చదువుతున్నారని, జ్యోతిక మాత్రమే హిందీ సినిమా కోసం ముంబైలో ఉన్నారని తెలుస్తోంది.

2006 లో లవ్ మ్యారేజ్..

తమిళ సినీ ప్రముఖులలో పాపులర్ కపుల్ అయిన సూర్య, జ్యోతిక పూవెల్లం కేతేపర్బ్ చిత్రంలో కలిసి నటించినప్పుడు ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ బావిలే కలంతు, కాక్క కాక్క, పెరళగన్, మాయావి, చిల్లును ఒరు కాదల్ వంటి 7కి పైగా చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2006లో పెద్దల ఆశీర్వాదంతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటీ నటులు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

సూర్య, జ్యోతిక జంటకు ఇద్దరు పిల్లలు

సూర్య, జ్యోతిక స్టార్ దంపతులకు దియా అనే 17 ఏళ్ల కుమార్తె. దేవ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నారు. కుటుంబం మొత్తం సినిమా బ్యాక్ గ్రౌండ్ అయినప్పటికీ దియా, దేవ్ ఇద్దరూ ఎప్పుడూ సినిమాల్లో నటించలేదు. దియా టెన్నిస్, ఫుట్‌బాల్ ఆటలపై దృష్టి సారిస్తోంది. తన సోదరి దియా లాగే చదువుతో పాటు దేవ్‌కు కరాటేపై చాలా ఆసక్తి ఉంది. ఫ్యూచర్ లో వీరిద్దరూ సినిమాల్లోకి వస్తారా? అంటే ఆ అవకాశం లేదు అన్పిస్తోంది.

పేద పిల్లలకు విద్యాదానం

కాగా హీరో సూర్య అకారం స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. మెడిసిన్, ఇంజినీరింగ్ ఇలా ఎన్నో కోర్సుల్లో పిల్లలను చదివించేలా చేస్తున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు