AP Elections 2024 : పవన్‌కు అండగా టాలీవుడ్… ఇప్పటి వరకు ఎంత మంది సపొర్ట్ చేశారంటే…?

AP Elections 2024 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా సక్సెస్ సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఆయనకు సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా సపోర్ట్ దక్కలేదు. కానీ ఈసారి మాత్రం ఆయనకు అండగా నిలవడానికి టాలీవుడ్ లో ఒక్కొక్క హీరో నెమ్మదిగా అడుగు లేస్తున్నారు. ఎప్పటిలాగే మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోలంతా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తుండగా, తాజాగా చిరంజీవి పిలుపుతో రవితేజ, నాని, రాజ్ తరుణ్ వంటి హీరోలు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా ట్వీట్లు చేయడం మొదలు పెట్టారు.

2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తున్నారు. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకుని వకీల్ సాబ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరోసారి సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ చేశారు. 2024 ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగడానికి పవన్ సిద్ధమయ్యాడు. ఈసారైనా చట్టసభలో అడుగు పెట్టాలని పట్టుదలతో కృషి చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే పవన్ ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వస్తున్నాడు.

చిరు స్పెషల్ వీడియో..

ఈ నేపథ్యంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి సపోర్ట్ గా ఓ వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ది తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం అని, సినిమాల్లోకి బలవంతంగా ఎంట్రీ ఇచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగానే అడుగు పెట్టాడంటూ చిరు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టార్ హీరోకు ఎలాంటి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మెగాస్టార్ చిరంజీవి తన పవన్ కు సపోర్ట్ గా పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం మెగా అభిమానుల్లో మరింత జోష్ ను నింపుతోంది.

- Advertisement -

పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్న హీరోలు…

ఇక ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ నుంచి జబర్దస్త్ యాక్టర్స్, పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఇతర నటీనటులు ప్రచారం మొదలు పెట్టేశారు. సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ తమ సపోర్ట్ ను తెలియజేయడమే కాకుండా ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు. తాజాగా నేచురల్ స్టార్ట్ నాని కూడా ఆ లిస్ట్ లో చేరిపోయాడు. సోషల్ మీడియా వేదికగా నాని పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటూ ట్వీట్ చేశారు.

ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నదంతా సాధిస్తారని, మీ వాగ్దానాలు అన్నింటిని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాను అంటూ పోస్ట్ చేశారు. అలాగే మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతునిస్తూ ట్వీట్ చేశారు. ఈ లిస్టులో మాస్ మహారాజా రవితేజ కూడా చేరిపోయారు. అందరూ గ్లాస్ గుర్తుకే ఓటు వేయాలని సోషల్ మీడియా వేదికగా కోరారు రవితేజ. ఈ స్టార్స్ తో పాటు ఇంకెవరెవరు ఆయనకు సపోర్ట్ చేస్తారో చూడాలి. ఈ నేపథ్యంలో వీళ్లంతా డైరెక్ట్ గా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే చర్చ జోరుగా నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు