Kalki 2898AD: ప్రభాస్ కోసం మహేష్.. వర్క్ అవుట్ అయితే విధ్వంసమే..!

Kalki 2898AD.. రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.. అశ్వినీ దత్ నిర్మాణ సారథ్యంలో భారీ అంచనాల మధ్య మే 9వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ జూన్ 27వ తేదీన విడుదల చేస్తున్నామని చిత్ర బృందం ప్రకటించింది.. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఆయనకు జోడిగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.. ఇక వీరితోపాటు అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దిశాపటాని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసిందే.అందుకు సంబంధించిన ఆయన పాత్రను కూడా రివీల్ చేశారు. ఈ పాత్ర సినిమాకే హైలెట్గా నిలవనుంది.

Kalki 2898AD: Mahesh for Prabhas..Work out but destruction..!
Kalki 2898AD: Mahesh for Prabhas..Work out but destruction..!

కల్కి 2898AD చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్..

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం మహేష్ బాబు తన వాయిస్ ఓవర్ ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సినిమా ఇట్రడక్షన్ లో శ్రీ మహా విష్ణువు అవతారం కనిపించనుంది అని..ఆ అవతారానికి మహేష్ బాబు తన గొంతును వినిపించబోతున్నట్లు సమాచారం.. ఒకవేళ ఇదే నిజమైతే.. ఒకవైపు ప్రభాస్ నటన మరొకవైపు మహేష్ బాబు గొంతు రెండూ కూడా సినిమాకి మరింత హైలెట్ గా నిలవబోతున్నాయి. మరి జూన్లో విడుదల కాబోతున్న ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ వదులుతున్న ఒక్కొక్క పోస్టర్ మరింత వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఇలాంటి విషయాలు కూడా సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలుస్తున్నానని చెప్పవచ్చు..

ప్రభాస్ తదుపరి చిత్రాలు..

స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD చిత్రాన్ని విడుదల చేసిన వెంటనే మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షెడ్యూల్ కూడా మొదలయ్యింది. హార్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత సలార్ 2 చిత్రంతో పాటు స్పిరిట్ చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాల తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

- Advertisement -

మహేష్ బాబు సినిమాలు:

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్కులో కనిపించనున్నట్లు సమాచారం.. ఇక ఈ సినిమాతో పాటు అప్పుడప్పుడు స్టార్ హీరోల సినిమాలకి కూడా వాయిస్ ఓవర్ అందిస్తూ మరింతగా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు