20 years for Arya : ఆర్య మూవీకి ముందుగా అనుకున్న టైటిల్ ఇదే… దీని అర్థం ఏంటో తెలుసా…?

20 years for Arya : కెరియర్ మొదట్లో వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత దర్శకుడిగా ఆర్య సినిమాతో తెలుగు ఇండస్ట్రీ పరిచయమయ్యారు సుకుమార్. ఈ సినిమా విడుదలై నేటికీ 20 సంవత్సరాలు. దిల్ సినిమా సమయంలో నిర్మాత దిల్ రాజుకు కథను వినిపించిన సుకుమార్ హీరోగా అల్లు అర్జున్ ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ని ఎంపిక చేసుకోవడానికి కూడా కారణం ఉంది. ఒకసారి దిల్ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించగా అల్లు అర్జున్ ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. ఆ సెలబ్రేషన్స్ లో బన్నీని చూసిన సుకుమార్. తన కథకు కరెక్టుగా సెట్ అవుతారని చెప్పారట. ఇక అప్పటికే గంగోత్రి సినిమా చేసిన అల్లు అర్జున్ చాలా కథలు విని.. ఏదీ నచ్చక మంచి కథ కోసం ఎదురుచూస్తున్న సమయంలో సుకుమార్ ఈ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పారట. అలాగే అల్లు అరవింద్, చిరంజీవి కూడా కథ విని ఓకే చెప్పడంతో ఆర్య సినిమా తెరపైకి వచ్చింది.

ముందుగా అనుకున్న టైటిల్ ఇదే..

అయితే కథను రాసుకునేటప్పుడు ముందుగా సుకుమార్ అల్లరి నరేష్ ను హీరోగా అనుకున్నారట.. గతంలో ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈ విషయాన్ని వెల్లడించారు.. అల్లరి సినిమా చూసి తాను రాసుకున్న ఆర్య సినిమాకు హీరోగా బాగుంటారని సుకుమార్ తనతో చెప్పారట.. కానీ కుదరలేదు.. అలా అవకాశం బన్నీకి వచ్చి బన్నీని హీరోగా ఈ సినిమా నిలబెట్టింది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్ గా నిలిచింది..ఇదిలా ఉండగా ఈ సినిమాకి ముందుగా అనుకున్న పేరు తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే.. పేరు మాత్రమే కాదు పేరు యొక్క అర్థం తెలిసినా సరే ఆశ్చర్యపోకమానరు.. ముందుగా సుకుమార్ కథ రాసుకునేటప్పుడు ఈ సినిమాకు “నచికేత “అనే టైటిల్ ని అనుకున్నారట.. కానీ కొన్ని కారణాలవల్ల ఈ టైటిల్ ని మార్చి ఆర్యగా పెట్టినట్లు తెలుస్తోంది.

నచికేత మీనింగ్..

ఇకపోతే ఈ ట్రెండీ లవ్ స్టోరీ కి పెట్టాలనుకున్న ఈ నచికేత అనే పదానికి అర్థం ఏమిటి అంటే సాధారణంగా ఈ పేరు కలిగిన వ్యక్తులు స్థానికంగా పుట్టుకతోనే ప్రణాళిక పరులు… ప్రతిదానిని ముందుగా సిద్ధం చేసుకుని.. ఆ తర్వాత మొదలు పెడతారట.. సమయం వచ్చినప్పుడు అనుకున్న పనిని నెరవేర్చడంలో ముందుంటారట. ముఖ్యంగా ఈ వ్యక్తులు విపరీతమైన వైఖరిని కలిగి ఉంటారు. అంతేకాదు పురుషులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారట. ముఖ్యంగా సాహసోపేతంగా జీవించడానికి ఎక్కువ మక్కువ చూపుతారని సమాచారం. అంతేకాదు రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం భయపడరు.. వీరిలో వివేకం చాలా ముఖ్యమైన లక్షణం సహజంగానే ఈ వ్యక్తులు చాలా గొప్ప మనసు కలిగి ఉంటారు.. ముఖ్యంగా వీరి ఎంత తెలివైన వారు అంటే తమ దారికి ఎవరైనా అడ్డొస్తే ఇతర వ్యక్తులను తప్పుదారి కూడా పట్టించగలరు.. వారి చంచలమైన మనసు ఎవరికైనా ఈర్షను కలిగించేలా చేస్తుంది.

- Advertisement -

మొత్తానికైతే ఇలాంటి టైటిల్ ని అనుకొని చివరిగా ఆర్య టైటిల్ ని ఫిక్స్ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు సుకుమార్.

20 years for Arya: This is the original title of Arya movie... do you know what it means...?
20 years for Arya: This is the original title of Arya movie… do you know what it means…?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు