Namitha vs Nayanatara : సెట్స్ లో నయన్ నాతో మాట్లాడలేదు… బిల్లా రీరిలీజ్ నేపథ్యంలో నమిత కామెంట్స్ వైరల్

Namitha vs Nayanatara : తమిళ మూవీ బిల్లా రీరిలీజ్ కు రెడి అవుతున్న నేపథ్యంలో గతంలో నయనతార గురించి ఆ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నమిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా సంచలనం సృష్టించిన హీరోయిన్ నమిత. గ్లామర్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నమిత తమిళ సినీ ప్రపంచంలో హాట్ ఐకాన్‌గా మారింది. నమిత గుజరాత్‌కు చెందినవారు. నమిత ఫ్యాషన్ రంగం నుంచి యాక్టింగ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 2000ల తొలినాళ్లలో నమితను వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు వచ్చాయి. తమిళ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఫ్లాప్ చిత్రాలతో నమిత స్టార్ డమ్ తగ్గింది.

తమిళం, తెలుగు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో ఈ భామ అప్పట్లో కన్నడ సినిమాలపై దృష్టి సారించింది. కానీ అక్కడ కూడా కలిసి రాకపోవడంతో నమిత కనిపించకుండా పోయింది. 2016లో రీ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళ బిగ్‌బాస్‌లో కూడా నమిత కంటెస్టెంట్‌గా మారింది. ఇక నమిత కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో బిల్లా ఒకటి.

- Advertisement -

అజిత్, నయనతార నటించిన బిల్లా చిత్రంలో నమిత కూడా ప్రధాన పాత్ర పోషించింది. నమిత, నయనతార గ్లామరస్ సీన్స్ ఆ రోజుల్లో హాట్ టాపిక్ అని చెప్పవచ్చు. తాజాగా బిల్లా రీ-రిలీజ్ ప్రకటించారు. బిల్లాలో నయనతారతో కలిసి నటించిన అనుభవాలను నమిత ఇప్పుడు పంచుకుంటున్నారు. కలిసి నటించినా సెట్స్ లో నయనతార తాను పెద్దగా మాట్లాడుకోలేదని నమిత చెప్పింది.

నయనతారతో మాట్లాడటం చాలా తక్కువ. ఇతర ఆర్టిస్టులతో ఆమె ఎలా ఉంటారో నాకు తెలియదు. కానీ నాతో మాత్రం మాట్లాడలేదని నమిత వెల్లడించింది. నేను ఎవరితోనూ మాట్లాడను. నా సన్నివేశాలు నేను చేశాను. ఆమె సీన్స్ ఆమె చేసేది. కలిసి నటించిన సన్నివేశాల్లో కూడా మేమిద్దరం మాట్లాడుకోలేదని నమిత పేర్కొంది.

హీరో అజిత్ కూడా పెద్దగా మాట్లాడని మనిషే అని, అయితే ఆయన చాలా ప్రొఫెషనల్ అని నమిత చెప్పింది. నమితకు పొగరు అని అందరూ అనుకుంటారు. కానీ నేను రిజర్వ్డ్ వ్యక్తిని. ఎక్కువ మాట్లాడలేను. సెట్‌లో డైలాగ్స్ లేదా పుస్తకాలు చదువుతాను అని నమిత పేర్కొంది.

బిల్లాలో నటిస్తున్నప్పుడు జరిగిన ఇతర సంఘటనలను కూడా నమిత పంచుకున్నారు. బ్రిడ్జి పైన అజిత్ తో ఓ సీన్ చేసే సమయంలో డైలాగులు లేవు బాడీ లాంగ్వేజ్ ముఖ్యం అన్నారు దర్శకుడు. ముఖ్యమైన సీన్, మీ కళ్లు మాట్లాడాలని దర్శకుడు చెప్పారని నమిత గుర్తు చేసుకున్నారు. బిల్లాలో నమిత సీజేగా నటించింది. బిల్లా మూవీ రీరిలీజ్ నేపథ్యంలో నమిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

బిల్లా తెలుగు వెర్షన్‌లో కూడా ఇదే పాత్రను పోషించింది నమిత. తెలుగు వెర్షన్‌లో అజిత్ స్థానంలో ప్రభాస్, నయనతార స్థానంలో అనుష్క శెట్టిని తీసుకున్నారు.

కాగా ప్రస్తుతం నమిత ఇద్దరు బిడ్డల తల్లి. గత ఆగస్టులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. కృష్ణుడికి అమితమైన భక్తురాలు అయిన నమిత తన కుమారులకు కృష్ణ ఆదిత్య, జ్ఞాన్ రాజ్ అని కృష్ణుడి పేరు పెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు