Fahad Faasil : పుష్ప వల్ల ఒరిగిందేమీ లేదు… ఫహాద్ సెన్సేషనల్ కామెంట్స్

Fahad Faasil : మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ తాజాగా పుష్పపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ మూవీ తరువాత తన కెరీర్ లో ఎలాంటి మార్పు లేదు అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చిపెట్టిన పుష్ప మూవీపై ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి ? అంటే…

పుష్ప తరువాత ఏం మారలేదు?

ఫహద్ ఫాసిల్ ఇటీవల కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన నటించిన ‘ఆవేశం’ సూపర్‌ హిట్‌ కావడంతో పాటు సినిమాలో ఫహాద్ నటనను అందరూ మెచ్చుకున్నారు. అంతకంటే ముందే ‘పుష్ప’లో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను పోషించి, అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ‘ పుష్ప’ సినిమా తర్వాత తన కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదన్నారు.

‘పుష్ప’ చిత్రం డిసెంబర్ 2021 నెలలో విడుదలైంది. ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయ్యారు. మిగతా నటీనటులకు ఆదరణ పెరిగింది. మంచి రెమ్యూనరేషన్ కూడా అందుకున్నారు. అయితే ఈ సినిమా తర్వాత తన కెరీర్‌లో ఎలాంటి మార్పు రాలేదని ఫహద్ చెప్పడం గమనార్హం.

- Advertisement -

సుకుమార్ ముందైన ఇదే చెప్తా…

‘పుష్ప సినిమాతో మీ కీర్తి కేరళను దాటి వెళ్లిందని తెలుసా?’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహాద్ ను అడిగారు. దీనికి అతను లేదు అని సమాధానం ఇచ్చాడు. ఫహాద్ మాట్లాడుతూ ‘నా కెరీర్ కోసం పుష్ప ఏమీ చేసిందని నేను అనుకోను. ఈ విషయాన్ని సుకుమార్ ముందు కూడా చెబుతాను. అందులో దాచడానికి ఏమీ లేదు. నేను నిజాయితీగా ఉండాలి. నేను ఇక్కడ నా పని చేస్తున్నాను. ఎవరినీ అగౌరవ పరచాలనే ఉద్దేశం లేదు.  పుష్ప తర్వాత ప్రజలు నా నుంచి మ్యాజిక్‌ను ఆశిస్తున్నారు. సుకుమార్‌ సర్‌పై నాకున్న ప్రేమతో తీసిన సినిమా ఇది. మలయాళ సినిమా తీయడమే నా పని’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రాజ్ కుమార్ రావ్ ప్రముఖ నటుడు. రణబీర్ కపూర్ దేశంలోనే గొప్ప నటుడు. వాళ్ళు నాలో ఏమి చూస్తున్నారో నాకు తెలియదు. అక్కడి ప్రజలు కుంబళంగి నైట్స్, ట్రాన్స్ చూశారు. ఏ సంబంధం ఉందని, ఏ ప్రాతిపదికన నా సినిమా చూస్తున్నారు అని నేను ఆశ్చర్యపోతున్నాను అని ఫహద్ ఫాసిల్ అన్నారు.

పాన్ ఇండియాతో సంబంధం లేదు..

చాలా మంది ఫహద్ ఫాసిల్‌ను పాన్ ఇండియా స్టార్ అని పిలుస్తారు. కానీ దీనికి ఆయన అంగీకరించలేదు. ‘నేను మలయాళ నటుడిని. పాన్ ఇండియాతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నమ్మిన పనులు చేస్తాను. సినిమా బిజినెస్ జరగాలి అన్నది నిజమే కానీ అది సెకండరీ. ఏ సినిమా పడితే ఆ సినిమాలు చేయలేను’ అని అన్నారు.

ఫహద్ ఫాసిల్ సినిమాకి సినిమాకి భిన్నమైన పాత్రలను అంగీకరిస్తాడు. ఈ కారణంగానే అతన్ని మూవీ లవర్స్ మరింత ఇష్టపడతారు అన్నది నిజమే. కానీ ఎక్కడెక్కడి ప్రేక్షకులో తన మూవీస్ చూస్తున్నారు అంటే అది పుష్ప ఇచ్చిన ఫేమ్ వల్లే అని ఫహాద్ ఎలా మర్చిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు