Best OTT Series : భార్యలను మార్చుకునే స్టోరీ… అలియా భటే ప్రశంసించిన ఈ సిరీస్‌ను మిస్ చేయకండి

Best OTT Series : థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పెద్ద సినిమాలకు ఓటీటీలో కూడా గట్టిగానే ప్రచారం చేస్తారు. కానీ కొన్ని చిన్న సినిమాలు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కానీ ఓటిటిలో మాత్రం పెద్దగా పట్టించుకోరు. అలియా భట్ నుంచి ప్రశంసలు అందుకున్న అలాంటి ఓ చిన్న సినిమా గురించి ఈరోజు తెలుసుకుందాం. సినిమా చిన్నదే కానీ కంటెంట్ మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. ఏకంగా భార్యలనే మార్చుకునే స్టోరీ. అలాగని బో*ల్డ్ కంటెంట్ మాత్రం కాదు. మరి ఇంతకీ ఆ మూవీ ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఆ మూవీ పేరు లాపతా లేడీస్. ఈ ఏడాది మార్చ్ 1 థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ హిందీ మూవీ. అలియా భట్ లాంటి ప్రముఖులను సైతం మెప్పించింది. కేవలం 4 కోట్ల అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ థియేటర్లలో మాత్రం 20 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. థియేటర్లలో రిలీజ్ అయిన నెలన్నర తర్వాత అంటే ఏప్రిల్ 26 నుంచి లాపతా లేడీస్ మూవీ దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చేసింది. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. స్టార్ హీరోయిన్ అలియా భట్ ఈ మూవీ అద్భుతంగా ఉందంటూ కామెంట్ చేయడమే కాదు నటీనటులపై ప్రశంసల వర్షం కురిపించింది. మరి ఓ స్టార్ హీరోయిన్ అందరి ముందు ఈ సినిమాను మెచ్చుకుంది అంటే ఎంతటి వర్త్  వాచింగ్ మూవీనో అర్థం చేసుకోవచ్చు.

ఇక అలియా భట్ ప్రశంసలను పక్కన పెట్టి ఈ మూవీని ఎందుకు చూడాలి? అనే వారికి సమాధానమే లాపతా లేడీస్ స్టోరీ. లాపతా లేడీస్ కథ విషయానికి వస్తే… 2001లో నిర్మల్ ప్రదేశ్ అనే గ్రామంలో లాపతా లేడీస్ స్టోరీ మొదలవుతుంది. అక్కడ రెండు జంటలకు పెళ్లి అవుతుంది. కానీ ఆ తర్వాత తెలియకుండానే ఒకరి భార్య మరొకరికి మారిపోతారు. అలా ఎలా మారిపోతారు? అంటే

- Advertisement -

దీపక్ కుమార్, పూల్ కు కొత్తగా పెళ్లవుతుంది. ఈ నవ దంపతులు ఇద్దరు కలిసి ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రైలు రాగానే ఇద్దరు ఎక్కేస్తారు. అక్కడిదాకా బాగానే ఉంటుంది. కానీ అదే ట్రైన్ లో మరో జంట అచ్చం పూల్ లాంటి దుస్తులను ధరించి జర్నీ చేస్తారు. ఇక ఇద్దరు కొత్త వధువులు కూడా సేమ్ డ్రెస్ ధరించడమే కాకుండా ముఖంపై ముసుగులు వేసుకుని ఉంటారు.

ఇక ఊరు రాగానే రైలు దిగే హడావుడిలో ఒకరి భార్యను మరొకరు చెయ్యి పట్టుకుని మరీ తీసుకెళ్తారు. మరి ఇంటికి వెళ్ళాక వాళ్ల విషయంలో ఏం జరిగింది? తిరిగి ఎవరి భార్యను వాళ్ల దగ్గరకు చేర్చారా? ఈ నేపథ్యంలో ఎదురైన పరిణామాలు ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓసారి లుక్కెయ్యాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు