Horror Movie on OTT: వణుకు పుట్టించే ఆత్మల ఆట… 90 సెకండ్లలో క్యాండిల్ ఆర్పేయకపోతే జరిగేది ఇదే

Horror Movie on OTT : ఓటిటీ ప్రపంచంలో రోజుకో కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. అయితే అందులోనూ హారర్ జానర్ అంటే పడి చచ్చే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా హారర్ మూవీ వచ్చిందంటే చాలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. చాలావరకు హారర్ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఉంటాయి. ఎంత భయం వేసినా గ్రిప్పింగ్ స్టోరీ ఉంటే ఆ మూవీని వదలకుండా చూస్తారు. ఇక భాష అడ్డు కాదనుకునేవారు ఈ హారర్ మూవీని తప్పకుండా చూడాలి. ముఖ్యంగా ఇందులో వణుకు పుట్టే ఆత్మల ఆట ఉంటుంది. 90 సెకండ్లలో క్యాండిల్ ఆర్పేయ లేదంటే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఊహించడం కూడా కష్టమే. మరి ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

ఈ దెయ్యం స్టోరీ డిఫరెంట్…

ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక డిఫరెంట్ దయ్యం మూవీ గురించి. సాధారణంగా దెయ్యం సినిమాలంటే మనుషులలోకి ప్రవేశించడం, వాళ్ళను హింసించడం, చంపేయడం వంటివి మాత్రమే చూస్తూ ఉంటాము. కొన్ని సినిమాలలో మాత్రమే దయ్యాలను పిలవడానికి గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్ తో పాటే ఈ మూవీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే గేమ్ ఆడి ఏకంగా ఆత్మల చెయ్యి పట్టుకుని ఈ మూవీలో మాట్లాడగలరన్నమాట.

మూవీ స్టోరీలోకి వెళ్తే…

ఓపెన్ చేస్తే కోల్ అనే అమ్మాయి తన తమ్ముడి కోసం వెతుకుతూ ఉన్నట్టుగా చూపిస్తారు. అయితే అతను సడన్ గా పిచ్చిపిచ్చిగా చేస్తూ కనిపిస్తాడు. ఊహించని విధంగా తన అక్క ముందే తనను తాను పొడుచుకుని చచ్చిపోతాడు. ఆ హఠాత్పరిణామానికి కోల్ షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత మియా, జెడ్ అనే ఇద్దరు స్నేహితులను చూపిస్తారు. తల్లి లేకపోవడంతో పాటు తమ్ముడు కూడా చనిపోవడంతో జెడ్ ఎక్కువగా తన ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటుంది. ఓ రోజు అమ్మాయికి దెయ్యం పట్టిన వీడియోను చూస్తూ ఉంటుంది. అయితే గేమ్ ఆడటం ద్వారా దయ్యలతో మాట్లాడొచ్చని జెడ్ తో చెబుతుంది మియా. అలాంటి ఓ ప్లేస్ కోసం ఇద్దరూ వెతుక్కుంటూ వెళ్తారు.

- Advertisement -

గేమ్ ఏంటంటే…

ఈ దయ్యాలతో మాట్లాడే గేమ్ ఆడాలనుకునేవారు ఓ బొమ్మను చేతిలో పట్టుకోవాలి. వారి ముందు ఓ వెలిగించిన క్యాండిల్ ని పెడతారు. అయితే దయ్యం వచ్చిన 90 సెకండ్ల తర్వాత వెంటనే క్యాండిల్ ను ఆర్పేయాలి. ఈ రూల్ ను గనక మర్చిపోతే దెయ్యాల ప్రపంచం నుంచి మనుషుల ప్రపంచంలోకి వచ్చిన ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది. ఇక రూల్స్ అన్ని తెలుసుకున్నాక మియా గేమ్ స్టార్ట్ చేస్తుంది. అయితే ఆమెలో 90 సెకండ్ల కంటే ఎక్కువే దయ్యం ఉంటుంది. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఆ దయ్యాన్ని మియా ఎలా వదిలించుకుంది? అనే విషయాలు తెలియాలంటే టాక్ టు మీ అనే మూవీని చూడాల్సిందే. వర్త్ వాచింగ్ అనిపించే ఈ హారర్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు