OTT Movie : షరతులు వర్తిస్తాయి….చైన్ బిజినెస్ మోసాలపై వచ్చిన తెలుగు మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : మోసాలలో తరచుగా జరిగే మోసం ఏమిటంటే చైన్ బిజినెస్. ఇది ఎప్పటికప్పుడు ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉంటుంది. దీనివల్ల ఎక్కువగా మోసపోయేది కామన్ మ్యాన్ అని చెప్పాలి. ఇలాంటి మోసాలపై ఓ మధ్యతరగతి వ్యక్తి చేసే పోరాటం, చైన్ బిజినెస్ లో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కిన తెలుగు సినిమా షరతులు వర్తిస్తాయి తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది అనే వివరాల్లోకి వెళితే…

కుమారస్వామి దర్శకత్వంలో చైతన్య రావు, భూమి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ షరతులు వర్తిస్తాయి. ఈ మూవీని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ పై శ్రీ కుమార్ గుండా, నాగార్జున సామల, డాక్టర్ కృష్ణ కాంత్ చిత్తజల్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీని మార్చి 15న థియేటర్లలోకి తీసుకొచ్చారు. రిలీజ్ కి ముందు నుంచే మూవీ పై పాజిటివ్ బజ్ ఉండగా, థియేటర్లలోకి వచ్చాక కూడా పాజిటివ్ టాక్ నడిచింది.

మూవీ స్టోరీలోకి వెళ్తే…

గ్రామాల్లో పలు ప్రాంతాల్లో చైన్ బిజినెస్ మోసం గురించి చెప్పే కథంశంతో షరతులు వర్తిస్తాయి మూవీ రూపొందింది. కరీం నగర్ బ్యాక్ డ్రాప్ లో పక్కా తెలంగాణ యాసలో రూపొందిన షరతులు వర్తిస్తాయి మూవీలో చైన్ బిజినెస్ మోసం వల్ల కొన్ని కుటుంబాలకు ఎలాంటి నష్టం జరిగింది? దానివల్ల వాళ్ల జీవితం ఎలా అంధకారంలో కూరుకుపోయింది? ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి ఆ మోసాన్ని ఎలా బట్టబయలు చేశాడు? అతను ఈ మోసాల పై ఎలాంటి పోరాటం చేశాడు? అనే అంశాలను కామెడీతో పాటు థ్రిల్లింగ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక దీంతోపాటే సినిమాలో భార్య భర్తల అనుబంధం, పల్లెటూరి మనుషుల మధ్య ఉండే అనుబంధం, ఆప్యాయత, ఫ్యామిలీ ఎమోషన్స్ ను మెయిన్ గా హైలెట్ చేశారు. సినిమాకు క్లైమాక్స్ హైలెట్ అనే టాక్ నడిచింది.

- Advertisement -

ఆహాలో స్ట్రీమింగ్…

తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలోకి వచ్చేసింది. ఇది మన కథ, మనలో ఒకరి కథ అంటూ ఈరోజు నుంచే అంటే మే 18 నుంచి స్ట్రీమింగ్ మొదలు పెట్టేసారు ఆహలో.

ఐఎండిబి రేటింగ్…

ఇక ఈ సినిమాకు ఐఎండిబి నుంచి కూడా మంచి రేటింగ్ వచ్చింది. 10కి 7.7 రేటింగ్ తెచ్చుకున్న షరతులు వర్తిస్తాయి మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. థియేటర్లలో మిస్ అయినవాళ్లు మంచి రేటింగ్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ వీకెండ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న షరతులు వర్తిస్తాయి మూవీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.

చైతన్య రావు సినిమాలు…

యూట్యూబ్ లో పాపులర్ అయిన 30 వెడ్స్ 21 అనే సిరీస్ తో చైతన్య రావు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ హీరో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో పడ్డాడు. ముందుగా సినిమాల్లో సైడ్ హీరోగా నటించిన చైతన్య రావు ప్రస్తుతం మెయిన్ హీరోగా మారాడు. రీసెంట్ గా కీడా కోలా అనే సినిమాలో హీరోగా నటించిన ఈ హీరో ఇప్పుడు షరతులు వర్తిస్తాయి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్వరలోనే తెప్పసముద్రం మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు చైతన్య రావు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు