Criminal Justice Season 4 : నరాలు తెగే ఉత్కంఠతకు కేరాఫ్ అడ్రస్ ఈ కోర్టు రూం డ్రామా… సీజన్ 4 సిద్ధం

Criminal Justice Season 4 : సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ కొత్త సీజన్ కోసం ఓటిటి మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. క్రిమినల్ జస్టిస్ ఫ్రాంచైజీలో నాలుగో సీజన్ కు అంతా సిద్ధం అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులను అలర్ట్ చేసింది. మరి ఇంతకీ ఈ కొత్త సిరీస్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది? అంటే…

రిలీజ్ డేట్ విషయంలో ట్విస్ట్

క్రిమినల్ జస్టిస్ ఫ్రాంచైజీ నుంచి నాలుగవ సీజన్ త్వరలోనే తెరపైకి రాబోతోంది. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సిరీస్లను పూర్తి చేసుకున్న ఈ సూపర్ హిట్ క్రైం థ్రిల్లర్ నాలుగవ సీజన్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. శుక్రవారం రోజు దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ తో వచ్చేసింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. కోర్టు నడుస్తోంది అలాగే కొత్త సీజన్ కూడా సిద్ధమవుతోంది. హాట్ స్టార్ స్పెషల్స్ క్రిమినల్ జస్టిస్ కొత్త సీజన్ తో మాధవ్ మిశ్రా వచ్చేస్తున్నాడు అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అందులో పంకజ్ త్రిపాఠి కనిపించాడు. ఇక ఆ తర్వాత క్రిమినల్ జస్ట్ కొత్త సీజన్ రాబోతోంది అంటూ హాట్ స్టార్ అనౌన్స్ చేసింది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇంకా నాలుగవ సీజన్ కు సంబంధించిన రిలీజ్ డేట్ ను హాట్ స్టార్ వెల్లడించలేదు.

వీడని సస్పెన్స్…

ఈ క్రైమ్ థ్రిల్లర్ లీగల్ డ్రామా వెబ్ సిరీస్ లో పంకజ్ త్రిపాఠి మాధవ్ మిశ్రా అనే డిఫెన్స్ లాయర్ పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీలో రిలీజ్ అయిన మూడు సీజన్లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాలుగవ సీజన్లో పంకజ్ త్రిపాఠి యాక్టింగ్, గ్రిప్పింగ్ సస్పెన్స్ స్టోరీని చూడడానికి ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఎదురు చూపులకు హాట్ స్టార్ ఎప్పుడు తెర దించుతుందో చూడాలి.

- Advertisement -

మూడు సీజన్లు హిట్టే…

నరాలు తెగే ఉత్కంఠతకు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ కోర్ట్ రూమ్ డ్రామా. మొదటి సీజన్ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన మూడో సీజన్ దాకా ఎక్కడా ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కొట్టకుండా రూపొందించారు. 2019లో క్రిమినల్ జస్టిస్ ఫస్ట్ సీజన్ రిలీజ్ అయింది. అందులో విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రను పోషించారు. ఆ తర్వాత రెండో సీజన్ క్రిమినల్ జస్టిస్ బిహైండ్ క్లోజ్డ్ డోర్స్ అనే పేరుతో రిలీజ్ అయింది. ఇందులో కీర్తి కులహరి లీడ్ రోడ్ లో కనిపించింది. 2022లో మూడవ సీజన్ అధూర సచ్ పేరుతో రిలీజ్ అయింది. అయితే మూడు సీజన్లు కూడా ఆధారాలు లేకుండా జైలు శిక్ష అనుభవిస్తున్న బాధితుల తరఫున పోరాడే అడ్వకేట్ గా పంకజ్ త్రిపాఠి నటించాడు. మాధవ్ మిశ్రా అనే లాయర్ గా ఆయన అదరగొట్టాడు. ఈ సిరీస్లో ఇండియన్ జైల్లో ఉండే పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. నేరం చేయకుండానే శిక్షను అనుభవించే వాళ్ళ తరఫున పోరాటం చేసే సన్నివేశాలు, లాయర్ సంపాదించే ఆధారాలు వంటి సన్నివేశాలతో కథ ఆద్యంతం ఆసక్తికరంగా నడుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు