NTR: ఎన్టీఆర్ మార్కెట్ ను దెబ్బతీసిన అల్లు అర్జున్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీని నందమూరి కుటుంబం, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంకు సంబంధించిన హీరోలు మాత్రమే ఏలుతున్నారు. బయట టాక్ కూడా ఇదే ఉంది. ఈ రెండు కుటుంబాల నుంచి మాత్రమే చాలామంది హీరోలు వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే ఈ రెండు కుటుంబాల లో కొంతమంది మాత్రమే బడా సినిమా లు చేసి సక్సెస్ అయ్యారు.

అలాంటి వారిలో అల్లు అర్జున్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈ ఇద్దరు బడా హీరోల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇద్దరు హీరోల సినిమాలు వచ్చాయి అంటే కచ్చితంగా 100 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయి. ఒకానొక సమయంలో 1000 కోట్లు కూడా దాటిపోతాయి. అలా చేసి చూపించారు కూడా ఈ ఇద్దరు హీరోలు.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ ఇద్దరు హీరోలలో నందమూరి కుటుంబానికి చెందిన వారు ఒకరైతే మెగాస్టార్ చిరంజీవి కొడుకు ఒకరు. అయినప్పటికీ ఈ సినిమా బంపర్ హిట్ అయి భారీగానే కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ సినిమా చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్కు మూడు సంవత్సరాలు పట్టింది.

- Advertisement -

ఈ మూడు సంవత్సరాలలో జూనియర్ ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టు ఏది చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసమే తన ప్రాణం పెట్టాడు. కానీ కొత్త సినిమా మాత్రం ఎక్కడ కూడా చేయలేదు జూనియర్ ఎన్టీఆర్. ఈ గ్యాప్ లోనే జూనియర్ ఎన్టీఆర్ స్థానాన్ని భర్తీ చేశాడు అల్లు అర్జున్. రాజమౌళి సినిమాతో… జూనియర్ ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నది నేపథ్యంలోనే వరుసగా సినిమాలు చేశాడు అల్లు అర్జున్.

Allu Arjun who damaged NTR market

త్రివిక్రమ్ మరియు అల్లు అర్జున్ కాంబినేషన్లో అలా వైకుంఠాపురంలో సినిమా వచ్చింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడమే కాకుండా… భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత పుష్ప సినిమా చేసి ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. దీంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారి మొగింది. అయితే మూడు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మంచిగానే కలెక్షన్లు రాబట్టింది కానీ… జూనియర్ ఎన్టీఆర్కు ఎక్కువగా క్రేజ్ రాలేదు.

ఈ సినిమాలో రాంచరణ్ ది కీలక పాత్ర కావడం మనం చూసాం. అలా జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ ను అల్లు అర్జున్ దెబ్బకొట్టాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు దేవర సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో పుష్ప 2 సినిమా కూడా రాబోతుంది. ఈ సినిమాలలో ఏది సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు