OTT Movie : 24 ఏళ్ల కుర్రాడిపై 40 ఏళ్ల మహిళకు అలాంటి ఆలోచనలు… నెవర్ బిఫోర్ బో*ల్డ్ మూవీ

OTT Movie : ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఎలాంటి కంటెంట్ చూడాలి అనే ఆప్షన్లు ఆడియన్స్ ఈజీగా సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ముఖ్యంగా బో*ల్డ్ కంటెంట్ అంటే ఇష్టపడే వ్యక్తులు దాని కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోయింది. ఏకంగా ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు బో*ల్డ్ కంటెంట్ ను వీక్షించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ఇక ఇందులో ఉండే మిగతా జానర్ల సినిమాలు ఒక ఎత్తు అయితే, రొమాన్స్ కేటగిరీకి ఉండే ఫ్యాన్స్ మరొక ఎత్తు. అలాంటి బో*ల్డ్ మూవీ లవర్స్ కోసమే అన్నట్టుగా కచ్చితంగా వారానికి ఒక్క బోల్డ్ కంటెంట్ మూవీ అయినా రిలీజ్ చేసేస్తున్నాయి ఓటిటి సంస్థలు. ఇక స్పెషల్ గా బో*ల్డ్ కంటెంట్ ను ఇష్టపడే వారి కోసమే తాజాగా ఓ హాట్ మూవీ ఓటిటీలోకి వచ్చేసింది. ఏకంగా కుర్రాడితో రొమాన్స్ చేసే ఆంటీ స్టోరీని ఒంటరిగా చూడడానికి ట్రై చేయండి. ఇంతకీ ఆ మూవీ ఏంటి? అంటే…

రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చిన బోల్డ్ మూవీ ఐడియా ఆఫ్ యూ. ఈ మూవీ స్టోరీ ఏంటంటే భర్త లేని ఓ నలభై ఏళ్ల మహిళ సింగిల్ మదర్ గా తన బిడ్డతో పాటే ఒక్కతే నివసిస్తూ ఉంటుంది. ఆమెకు ఓ 24 ఏళ్ల కుర్రాడితో పరిచయం జరుగుతుంది. అతను ఒక రాక్ బ్యాండ్ లో లీడ్ సింగర్ గా పని చేస్తూ ఉంటాడు. వీళ్లకు వరల్డ్ లోనే అత్యంత అందమైన కుర్రాళ్ళ బ్యాండ్ గా మంచి పాపులారిటీ ఉంటుంది. అనుకోకుండా వీళ్లిద్దరి మధ్య జరిగిన పరిచయం రొమాన్స్ కు దారి తీస్తుంది. వాంఛలు తీర్చుకోవడానికి ఇద్దరూ ఈ పరిచయాన్ని ఉపయోగించుకుంటారు.

అయితే సెలబ్రిటీలు ఎక్కడ ఉంటే కెమెరాల కళ్ళు అక్కడ ఉంటాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీ కుర్రాడితో డేటింగ్ చేస్తున్న ఆ మహిళ పర్సనల్ లైఫ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. అయితే ఆమె మాత్రం కోల్పోయిన జీవితాన్ని తిరిగి పొందాలని, కోరికలు తీర్చుకోవాలని మాత్రమే అనుకుంటుంది. కానీ ఊహించని విధంగా ఆమె లైఫ్ అంతా నెట్టింట్లో దర్శనం ఇస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ అబ్బాయి, మహిళ జీవితాలు ఎలాంటి టర్న్ తిరిగాయి? అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమేనా లేదంటే కా*మమా? చివరికి ఏం జరుగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఐడియా ఆఫ్ యూ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి తీరాల్సిందే.

- Advertisement -

ఇక ఈ మూవీలో ఆస్కార్ అవార్డు విన్నర్ ఆనీ హాతే లీడ్ రోల్ పోషించింది. ఈ హాలీవుడ్ మూవీ స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఆడియన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటుంది. అంటే కావాల్సిన బో*ల్డ్ కంటెంట్ తో పాటే అదిరిపోయే స్క్రీన్ ప్లే కూడా ఉందన్నమాట. కాబట్టి బో*ల్డ్ మూవీ లవర్స్ ఈ మూవీని అస్సలు మిస్ కాకుండా చూసుకోండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు