Supritha Insta : చేతిలో మందు గ్లాస్‌తో ఫుల్ ఎంజాయ్… సముద్రం ఒడ్డున సుప్రీత రచ్చ మాములుగా లేదు

Surekha vani daughter supritha enjoying vacation: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. తల్లి పాత్ర నుంచి హీరోయిన్ పాత్ర వరకు హీరో పాత్ర నుంచి తండ్రి పాత్ర వరకు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పాత్రలు చేసేవారు మన ఇండస్ట్రీలో ఉన్నారు. ముఖ్యంగా… హీరో తల్లిగా లేదా హీరో అత్తయ్యగా…. నటించే వారు చాలామంది ఉన్నారు. అలాంటి పాత్రలు చేసి సక్సెస్ అయిన వారు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఈ సక్సెస్ అయిన నటీమణులలో సురేకా వాణి ఒకరు. నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సైడ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది సురేఖ వాణి. కూతురు సుప్రీత తో కలిసి కూడా తెగ రచ్చ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. ఈ మధ్యకాలంలో అయితే ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ అంతా కాదు. ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కనిపిస్తారు. విదేశీ టూర్లకు కూడా వెళతారు. అక్కడ ఎంజాయ్ చేస్తూ తమ హాట్ అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరి రెచ్చగొడుతూ ఉంటారు.

ఈ తరుణంలోనే ఈ తల్లి కూతుర్లు ఇద్దరు నిత్యం సోషల్ మీడియాలోనే ట్రెండ్ అవుతూ ఉంటారు. అయితే సురేఖ వానికి సోషల్ మీడియాలో ఎంత ఫాలో అయిందో అంతే ఫాలోయింగ్ ఈమె కూతురు సుప్రీతాకు కూడా ఉంది. త్వరలోనే హీరోయిన్ కాబోతున్న ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సోషల్ మీడియాలోనే కాకుండా ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది సుప్రీత.

- Advertisement -

దానికి తోడు సురేఖ వాణి కూతురు సుప్రీత ఎప్పటికప్పుడు నెటిజన్లతో మాట్లాడుతూనే ఉంటుంది. నిత్యం అందర్నీ కనువిందు చేస్తూనే ఉంటుంది. అయితే తాజాగా సురేఖ వాణి కూతురు సుపీతకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా మందు తాగుతూ రచ్చ చేసింది ఈ బ్యూటీ. తన స్నేహితులతో వెకేషన్ కు వెళ్లిన సుప్రీత… అక్కడ మందు గ్లాస్ పట్టుకొని ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతేకాకుండా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఓ పోస్ట్ కూడా రాసుకోవచ్చింది. ఈ ప్రయాణం నాకు చాలా మంచి అనుభూతి ఇచ్చింది అంటూ పేర్కొంది సుప్రీత. దీంతో నేటిజన్స్ సురేఖ వాణి కూతురు సుప్రీత పై ఫైర్ అవుతున్నారు. ఒక ఆడదానివై ఉండి… ఇలా పబ్లిక్ గా మందు కొట్టడం ఏంటని మండిపడుతున్నారు. మరి కొంతమంది సుప్రీత ను వెనుకేసుకు వస్తున్నారు. ఈ మధ్యకాలంలో మందు తాగడం చాలా కామన్ అయిపోయిందని… ఎంజాయ్ కోసం తాగితే తప్పేంటి అని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు