OTT Movie : పెళ్లయ్యాక భర్త వేరే అమ్మాయితో భార్య మరో అబ్బాయితో… కట్ చేస్తే భర్తకు విషయం తెలిసి….

OTT Movie : ఇటీవల కాలంలో బో*ల్డ్ కంటెంట్ కి ఆదరణ ఎక్కువైందని చెప్పాలి. ఓటిటీ ప్రపంచం చేతుల్లోకి వచ్చాక ఇదివరకు బో*ల్డ్ అనే మాటను పలకడానికి కూడా భయపడిన ఎంతో మంది ఆ కంటెంట్ ను హ్యాపీగా చూసేస్తున్నారు. ఇక జానర్ బోల్ట్ అయినప్పటికీ అందులో ఆలోచనాత్మక కంటెంట్ ఉండే సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి భర్త సరిగ్గా చూసుకోవట్లేదని ప్రియుడుకి భార్య దగ్గర అవ్వడం, ఆమె భర్త పెళ్లయ్యాక కూడా మరో అమ్మాయితో ఉండడం లాంటి కథతో ఓ బో*ల్డ్ మూవీ రిలీజ్ అయింది. విశేషం ఏమిటంటే అందులో హీరోయిన్ గా పూర్ణ నటించింది. ఆ మూవీ పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే….

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు డెవిల్. ఈ మూవీ సస్పెన్స్, ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అథియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పాపులర్ సౌత్ హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్ పోషించింది. టాలీవుడ్ హీరో త్రిగున్ ఈ సినిమాలో కీలకపాత్రను పోషించాడు. విధాథ్ హీరోగా నటించారు. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు పెద్దగా ప్రేక్షకాదరణ దక్కలేదు. కానీ ఓటీటీలోకి వచ్చాక మాత్రం ఆడియన్స్ నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ ఇప్పటిదాకా ఈ మూవీ నుంచి చూడకపోతే ఈ వీకెండ్ లుక్ వెయ్యండి.

మూవీ స్టోరీలోకి వెళ్తే…

డెవిల్ మూవీలో హౌస్ వైఫ్ గా కనిపించింది పూర్ణ. స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఓ ఫేమస్ లాయర్ ను పెళ్లి చేసుకుంటుంది హీరోయిన్. కానీ అతను మాత్రం పెళ్లికి ముందు నుంచే ఆఫీస్ లో మరో అమ్మాయిని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పెళ్లి తర్వాత కూడా ఇంట్లో భార్య ఆఫీస్ లో ప్రియురాలు అన్నట్టుగా ఇద్దరితోను రిలేషన్షిప్ మైంటైన్ చేస్తాడు. అయితే ఓ అనుకొని యాక్సిడెంట్ తర్వాత రోషన్ అనే వ్యక్తి హీరోయిన్ కు పరిచయమవుతాడు. అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది హీరోయిన్. రోషన్ తన పట్ల కేరింగ్ చూపిస్తున్న హీరోయిన్ పై మనసు పడతాడు.

- Advertisement -

వదలని ప్రియుడు

కానీ పూర్ణ మాత్రం అప్పటికే తనకు పెళ్లయిపోయిందని చెప్తుంది. అయినా పట్టించుకోకుండా ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు ఆమె భర్తను ఆఫీస్ లో ఉన్న అమ్మాయి మోసం చేస్తుంది. దీంతో ఆమె భర్త పూర్తిగా మారిపోయి భార్యను ప్రేమగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తాడు. ఇలా మొత్తానికి గర్ల్ ఫ్రెండ్ మోసం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య హ్యాపీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ అంతలోపే రోషన్ ఎంట్రీ ఇస్తాడు. ఆమెకు కాల్స్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా తనను చూడడానికి ఏకంగా ఇంటికి వెళ్తాడు. దీంతో ఈ విషయం తెలిసిన ఆమె భర్త తర్వాత ఏం చేస్తాడు? స్టోరీ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే డెవిల్ మూవీ పై ఓ లుక్ వేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు