Game Changer : పాపం దిల్ రాజు పరిస్థితి ఎవరికి రాకూడదు… శంకర్ వల్ల 60 కోట్లు లాస్

Game Changer: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఒకటి. ఈ బ్యానర్ కి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇమేజ్ ఉంది. దిల్ సినిమాతో మొదలైన ఈ బ్యానర్ దాదాపు 50 సినిమాలను పూర్తి చేసుకుంది. అయితే ఈ బ్యానర్లో 50వ సినిమాగా వస్తుంది అని అనౌన్స్ చేసిన గేమ్ చేంజర్ సినిమా మాత్రం ఎక్కడో ఆగిపోయింది. దాదాపు మూడేళ్ల క్రితం అనౌన్స్మెంట్ చేసిన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు. అయితే ఈ సినిమా విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు దిల్ రాజు.

శంకర్ సగం సగం పనులు

దర్శకుడు శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పేరుకు మాత్రం తమిళ్ దర్శకుడు అయినా కూడా తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. శంకర్ సినిమాలకు బ్రహ్మరథం పడతారు. రీసెంట్ గా రీ రిలీజైన అపరిచితుడు సినిమాకి కూడా అదే విధంగా బ్రహ్మరథం పట్టారు. ఇకపోతే మొదటిసారి శంకర్ తెలుగులో సినిమాను చేస్తున్నాడు అన్నప్పుడు చాలామంది ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూశారు. దానికి తోడు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేదు. సగంలోనే అయిపోయింది.

క్లారిటీ లేని రిలీజ్ డేట్

అయితే దాదాపు మూడేళ్ల కింద మొదలైన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలో అధికారక ప్రకటన అయితే రాలేదు. వాస్తవానికి ఈ సినిమాతో పాటు శంకర్ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా భారతీయుడు 2. ఆ సినిమా దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ తరుణంలో గేమ్ చేంజర్ సినిమాను విడిచిపెట్టి శంకర్ భారతీయుడు సినిమా పైన ఫోకస్ పెట్టడంతో చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

- Advertisement -

Ram Charan, Shankar's 'Game Changer'

60 కోట్లు నష్టం

అయితే గేమ్ చేంజర్ సినిమాకు కథను కార్తీక్ సుబ్బరాజ్ అందించాడు. మొదటి ఈ కథను కార్తీక్ సుబ్బరాజు రాసుకున్నాడు. అయితే ఇది ఒక శంకర్ రేంజ్ సినిమా అని తనకు అనిపించి ఈ కథను శంకరకు ఇచ్చాడు. అయితే ఈ స్క్రిప్ట్ కి రామ్ చరణ్ బాగుంటాడని డిసైడ్ అయి చరణ్ తో సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి దాదాపు 60 కోట్ల వరకు ఫుటేజ్ వేస్ట్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా సినిమా 25 శాతం పూర్తి కాకుండా మిగిలింది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ కూడా లేదు. దాదాపు 3 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రేక్షకులతో పాటు దిల్ రాజు కూడా నిరాశతో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాను మొదట 200 కోట్లు బడ్జెట్ అంటే మొదలు పెట్టారంట. ఇప్పుడు దాదాపు 330 కోట్ల వరకు ఈ సినిమా బడ్జెట్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కు శంకర్ సరిగ్గా హాజరు కాకపోవడం. మధ్యలో యంగ్ డైరెక్టర్ శైలస్ కొలను వెళ్లి కొన్ని సీన్స్ చేయడం కూడా జరిగింది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు