DJ Tillu 2 : సిద్దుకు డైరెక్టర్ వచ్చాడు

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ “డీజే టిల్లు” సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా సీక్వెల్ వస్తుందని, చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు. “డీజే టిల్లు 2” అనే పేరుతో పూజా కార్యక్రమం జరిగింది. అయితే ఇటీవల “డీజే టిల్లు 2” నుండి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నాడు. హీరో సిద్దు జొన్నలగడ్డ కు విమల్ కృష్ణ కు మధ్య క్రియేటివ్ డిస్టెన్స్ వచ్చిందని, అందుకే విమల్ కృష్ణ ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.

దీంతో ఇప్పటి వరకు “డీజే టిల్లు 2” కు డైరెక్టర్ లేడు. ఈ క‌థ‌ని డీల్ చేయ‌గ‌లిగే ద‌ర్శ‌కుడి కోసం చిత్ర‌ బృందం అన్వేషిస్తోంది. తాజా గా ఒ డైరెక్టర్ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనే మ‌ల్లిక్ రామ్. తేజా సజ్జా హీరో వచ్చిన అద్భుతం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైరెక్టర్ మల్లిక్. అద్భుతం సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంతో చిత్ర బృందం ఎంచుకున్నట్టు తెలుస్తుంది. “డీజే టిల్లు 2” స్టోరీని డీల్ చేయగలిగే సత్తా మల్లిక్ ఉందని చిత్ర బృందం ఆలోచించినట్టు సమాచారం.

ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు వ‌ర్క్ జ‌రుగుతోందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఈ స్క్రిప్టు పనుల్లో మల్లిక్ కూడా ఉన్నట్టు సమాచారుం. కాగ “డీజే టిల్లు 2” సినిమాకు హీరో సిద్దు జొన్నలగడ్డ కథ, డైలాగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు