Shivani Rajasekhar : చేతిలో సినిమాల్లేవ్.. మళ్ళీ ఓటిటి ను నమ్ముకుంది.?

Shivani Rajasekhar : టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలని చాలా మంది కలలుగంటూ ఉంటారు. కానీ టాలెంట్ ఉన్న కొందరికే ఆ ఛాన్స్ దక్కుతుంది. మరి కొందరు గ్లామర్ షో తో నెట్టుకొస్తారని భావించినా, అవి కొన్ని ఎక్కువ ఆఫర్లు తీసుకొస్తాయేమో గాని, స్టార్ హీరోయిన్ గా మాత్రం కాలేరు. ఇక తెలుగు హీరోయిన్లకైతే అవకాశాలు కాస్త తక్కువే అని చెప్పాలి. అడపాదడపా అంజలి లాంటి హీరోయిన్లు ఇతర ఇండస్ట్రీ లో ఫేమస్ అయ్యి ఇక్కడ ఫేమ్ సంపాదించిన వాళ్లే. అయితే టాలెంట్ కి తోడు అదృష్టం కూడా ఉంటే కెరీర్ లో అవకాశాలు ఎలాగైనా వస్తూనే ఉంటాయి. కానీ అలా ఛాన్స్ లు వచ్చినపుడే వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియాలి. అయితే తెలుగు హీరోయిన్ గా ఒకప్పటి స్టార్ హీరో కూతురిగా మంచి బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చి కూడా హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది శివాని రాజశేఖర్ కి. జీవిత రాజశేఖర్ ల గారాల కూతురిగా టాలీవుడ్ లో సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పెద్ద గ్లామర్ షో చేయకున్నా, మంచి యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అయితే సరైన అవకాశాలు మాత్రం ఈ అమ్మాయికి కరువయ్యాయి.

హిట్టొచ్చినా.. ఛాన్సులు కరువు?

అయితే కెరీర్ బిగినింగ్ నుండే మంచి స్క్రిప్ట్ లే సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది ఈ భామ. అద్భుతం, కోట బొమ్మాళి PS సినిమాలతో సక్సెస్ కూడా అందుకుంది. కానీ ఇప్పటివరకు సరైన సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ మధ్య కోట బొమ్మాళి సినిమా కోసం శివాని చాలా ప్రమోషన్లు చేసింది. సినిమా రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ తెచ్చుకుని డీసెంట్ హిట్ అయింది కానీ, సినిమా ఛాన్సులు మాత్రం అంతగా రాలేదు. కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ వస్తుంది. ఆ మధ్య జీవిత రాజశేఖర్ సొంత నిర్మాణంలో శివాని ని మెయిన్ లీడ్ గా పెట్టి సినిమా తీద్దామన్నా కుదరలేదు. కానీ శివాని మాత్రం వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా సినిమాలు చేద్దామని చూస్తుంది. అందుకే ఆ మధ్య తమిళ్ లో కూడా రెండు సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ప్లాప్ కావడంతో అక్కడ కూడా బ్రేక్ రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఓటిటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శివాని రాజశేఖర్.

Shivani Rajasekhar new movie released in OTT

- Advertisement -

ఓటిటి ను నమ్ముకున్న శివాని..

శివాని రాజశేఖర్ (Shivani Rajasekhar) హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘విద్య వాసుల అహం’. రాహుల్ విజయ్ హీరోగా నటించగా, తాజాగా ‘ఆహ’ ఓటిటి లో రిలీజ్ కావడం జరిగింది. అయితే శివాని రాజశేఖర్ హీరోయిన్ గా కూడా ముందు ఓటిటి సినిమాతోనే పరిచయం అయింది. తేజ సజ్జ హీరోగా నటించిన అద్భుతం సినిమాతో మూడేళ్ళ కింద హీరోయిన్ గా పరిచయం కాగా, అది ఓటిటి లో రావడం వల్ల చాలా మంది ప్రేక్షకులకి తెలియలేదు. ఇక ఆ తర్వాత కూడా WWW, తమిళ్ లో అంబారివు అనే సినిమాల్లో నటించగా అవి కూడా ఓటిటి లోనే వచ్చాయి. ఇక లాస్ట్ ఇయర్ రాజ్ తరుణ్ తో కలిసి ‘ఆహా నా పెళ్ళంటా’ ఓటిటి వెబ్ సిరీస్ తో పలకరించింది. ఇవి ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చినా అవకాశాలు తేలేదు. ఇప్పుడు మళ్ళీ ఓటిటి సినిమానే నమ్ముకుంది శివాని. ఇక తాను నటించిన విద్య వాసుల అహం సినిమా ఈరోజే (మే 17)న ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా తర్వాతైనా శివాని కి అవకాశాలు వస్తాయేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు