Shivani Rajasekhar : అన్నీ అలాంటి సినిమాలేనా? ఇలాగైతే శివాని స్టార్ హీరోయిన్ కావడం కష్టమే

యాంగ్రీ యంగ్ మాన్ గా రాజశేఖర్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన వారసురాలిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాజశేఖర్ గారాల పట్టి శివాని రాజశేఖర్. అయితే టాలీవుడ్ లో శివాని చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా ప్రయత్నాలు అనిపిస్తోంది. స్టార్ హీరోయిన్ కావడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను కూడా పలకరించేసింది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ లలోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. అయినప్పటికీ శివాని రాజశేఖర్ కు అనుకున్న పేమ్ రానేలేదు.

ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ “కోట బొమ్మాలి పీఎస్” అనే సినిమాతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా నవంబర్ 24న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ టీం సినిమా ప్రమోషన్లపై దృష్టి పెట్టింది. అయితే ఫిలిం వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదట.

2021లో రిలీజ్ అయిన “నాయట్టు” అనే మలయాళ మూవీకి “కోట బొమ్మాలి పీఎస్” రీమేగా వస్తోంది. అయితే ఈ రీమేక్ లో శివాని రాజశేఖర్ నటనకు అంతగా స్కోప్ లేదట. ఇది మాత్రమే కాదు ఇంతకుముందు శివాని రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ దాదాపుగా ఇలాగే ఉన్నాయి. సినిమాలో ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అనే విధంగా ఉండే పాత్రలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.

- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ రావాలంటే ఇలాంటి సినిమాలు చేస్తే సరిపోదు. నటనకు మంచి ప్రాధాన్యత ఉండే కథలను ఎంచుకోవాలి. అలాగే కాస్త గ్లామర్ డోస్ కూడా ఎక్కువే ఉండాలి. టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకోవాలంటే కేవలం సినిమాల్లో కన్పిస్తే చాలదు.

నిన్న మొన్న ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లు కూడా మంచి కథలను ఎంచుకుని దూసుకెళ్తున్నారు. శ్రీలీల, పాయల్ రాజ్ పుత్ లాంటి హీరోయిన్లు చేస్తున్న హంగామా ముందు అచ్చ తెలుగమ్మాయి అయిన శివాని రాజశేఖర్ తేలిపోతోంది. ఆమెకు అవకాశాలు రావట్లేదా?

లేక వచ్చినా సరైన కథలను ఎంచుకోవట్లేదా? అనే సందేహం ఎదురవుతోంది రాజశేఖర్ ఫ్యాన్స్ కు. అందం మాత్రమే ఉంటే సరిపోదు, తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటో నిరూపించుకునే రోల్స్ ఎంచుకుంటేనే సిల్వర్ స్క్రీన్ పై స్టార్ లా మెరిసే అవకాశం దక్కుతుంది. మరి ఈ విషయాలను మన రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ఎప్పుడు అర్థం చేసుకుంటుందో చూడాలి

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు