Signs of Alcohol Addiction: పచ్చి తాగుబోతు అయితే ఇలా ఉంటారట… మరి మీరు?

యూత్ లో శరవేగంగా పెరుగుతున్న మద్యపాన వ్యసనంపై ఆరోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఈ వ్యసనం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి కావడమే కాకుండా మనసుతో పాటు డబ్బును కూడా ప్రభావితం చేస్తుంది. నేరుగా తీవ్రమైన గుండె జబ్బులకు కారణం అవుతుంది. పైగా మెదడుపై ఎఫెక్ట్ పడుతుంది. ఆల్కహాల్ వల్ల ఇన్ని అనర్ధాలు తెలిసినా చాలా మంది మద్యం తాగుతూనే ఉన్నారు.

అయితే కొంతమంది కేవలం హాబీగా మందు తాగితే, మరికొందరు స్నేహితుల సహవాసం కోసం తాగుతారు. ఇలా ఫ్రెండ్స్ కోసం, లేదా మీ సరదా కోసం తాగడం సమొదలు పెట్టి, ఆ తరువాత మందుకు బానిసైపోతారు.ముందు ఒక్క పెగ్గుతో స్టార్ట్ చేస్తారు. ఆ తరువాత దానికి హద్దు, అదుపు లేకుండా తాగడం కొనసాగిస్తారు. ఇంకేముంది అలవాటు కాస్తా వ్యసనంగా మారుతుంది. ఒక్కసారి మందుకు బానిస అయ్యారంటే ఆ తరువాత ఆ వ్యసనాన్ని పక్కన పెట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి మందుకు బానిస అయ్యారు అని తెలుసుకోవడం ఎలా?… ఈ కింద ఇస్తున్న కొన్ని లక్షణాలను బట్టి మీరు మందుకు బానిస అవుతున్నారేమో తెలుసుకోండి. ఎర్లీ స్టేజ్ లోనే తెలుసుకుంటే ఆ వ్యసనం నుంచి బయటపడడం కొంతవరకు ఈజీ అవుతుంది.

తాగుబోతుల లక్షణాలు / మద్యపాన వ్యసనం లక్షణాలు

- Advertisement -

ప్రతిరోజూ మద్యం సేవించేవాళ్ళు ఏదైనా కారణంతో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినా ? లేదా మందు తాగకపోతే చేతులు వణకడం స్టార్ట్ అయితే మీరు తాగుడుకు బానిస అయినట్టే . .

Signs of Alcohol Addiction

స్నేహితులతో సమయం గడిపినా లేదా కుటుంబ సభ్యులను కలిసినా… ఇలా సందర్భం ఏదైనా తాగడం మాత్రం కామన్ అయితే మీరు మందుకు అడిక్ట్ అయినట్టే.

Signs of Alcohol Addiction

వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపిన తర్వాత కూడా మద్యం తాగాలని అనిపిస్తే మీరు మద్యానికి బానిసలుగా మారారని అర్థం.

Signs of Alcohol Addiction

ఇల్లు, ఆఫీస్, కారు లేదా మరెక్కడైనా మందును స్టాక్ ఉంచుకోవడం వంటి పనులు చేస్తున్నారు అంటే అది ఆల్కహాల్ వ్యసనానికి సంకేతం. అది సరదా కాదు మీరు వ్యసనపరులు అయ్యారని అర్థం,

Signs of Alcohol Addiction

మద్యం సేవించకపోతే విచిత్రమైన అలజడి, తాగిన తర్వాత మంచి అనుభూతిని కలిగితే అది ఆల్కహాల్ వ్యసనానికి సంకేతం.

Signs of Alcohol Addiction

కొద్దిగా మందు తాగినప్పుడు కిక్ ఎక్కినట్టు అన్పించకపోతే అది కూడా మీరు పచ్చి తాగుబోతు అయ్యారనే సంకేతమే. ఎక్కువ ఆల్కహాల్ తాగితేనే మత్తు ఎక్కుతుంది అంటే మద్యానికి బానిసైనట్లే.

Signs of Alcohol Addiction

స్నేహితులతో కబుర్లు చెప్తూ తాగడం వంటివి ఆలోచిస్తున్నారంటే.. స్నేహితులను కలవాలని కాదు మద్యం తాగాలని తహతహలాడుతున్నారని అర్థం.

Signs of Alcohol Addiction

కొంతమంది తాగేటప్పుడు తమను తాము నియంత్రించుకోకుండా అతిగా తాగుతుంటారు. అదికూడా మందు వ్యసనంగా మారింది అనే సంకేతమే.

Signs of Alcohol Addiction

చుక్క పడ్డాక ఏం జరిగిందో, మీరు ఎక్కడ ఉన్నారు? మీరు చేసిన పనులు లాంటివి గుర్తులేకపోతే… మద్యానికి బానిస అయ్యారని అర్థం.

Signs of Alcohol Addiction

అన్తకాకుండా తాగాక వాంతులు, విపరీతమైన చెమట, వణుకు, వికారంగా అనిపించడం, పీడకలలు, శరీరం తిమ్మిర్లు, మూర్ఛపోవడం వంటి శారీరక లక్షణాలు కన్పించినా పచ్చి తాగుబోతుగా మారారని అర్థం.

Signs of Alcohol Addiction

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు