Samantha: తల్లి కాబోతున్న సమంత.. నిజమేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై.. ఆ తర్వాత అదే సినిమా హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే నాలుగు సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. 2021 అక్టోబర్ రెండవ తేదీన విడాకులు ప్రకటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నాగ చైతన్య తో పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇలా సడన్గా విడాకులు తీసుకోవడం సరికొత్త అనుమానాలకు దారితీసిందని చెప్పవచ్చు. ఏ విషయాన్ని అయినా డిఫరెంట్ గా ఆలోచించే సమంత తనకు నచ్చినట్టుగా బతకాలని కోరుకుంటుంది.

అందుకే విడాకులు తీసుకుంది అన్న కామెంట్లు కూడా వినిపించాయి. ఇకపోతే సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన టాలెంట్ తోనే టాప్ హీరోయిన్గా మారిన సమంత.. 14 సంవత్సరాల తన సినీ కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కెరియర్ పరంగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న ఈమె.. వ్యక్తిగత జీవితపరంగా ఎన్నో బాధలు, ఇబ్బందులు పడిందని చెప్పవచ్చు.

అంతేకాదు సమంతను కావాలని ఒక వర్గం వారు టార్గెట్ చేస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇకపోతే దీనికి తోడు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి కూడా ఆమెను ఇబ్బంది పెడుతోంది.

- Advertisement -

గత సంవత్సర కాలంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఈమె వయసు ఇప్పుడు 36 సంవత్సరాలు. వయసులో ఈమె కంటే పెద్దవారు.. భర్తకు దూరమైన వారు మళ్లీ పెళ్లి చేసుకొని జీవితాన్ని మొదలు పెడుతుంటే సమంత మాత్రం ఒంటరిగానే ఉంటుంది.

ఇక తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా మళ్లీ పెళ్లి చేసుకోవాలని సలహా ఇస్తున్నారట. అయితే సమంతకు జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. ఒంటరిగానే ఉండిపోవాలని సమాచారం. ఇదిలా ఉండగా ఇక్కడ మరో విషయం ఏమిటంటే సమంతాకు తల్లి కావాలన్న కోరిక చాలా బలంగా ఉందట. అందుకే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన లేకపోయినా సరే సమంత తల్లి కావాలనుకుంటోంది అనే వార్త మాత్రం గట్టిగా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇలా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలనుకున్న ఆమె మంచి మనసుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు