Kamal Hasan : అన్ని విభాగాల్లోనూ ఉలగనాయగన్ పట్టు..

Kamal Hasan : కోలీవుడ్ స్టార్ హీరో, లెజెండరీ నటుడు కమల్ హాసన్ మల్టి టాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. కేవలం నటుడిగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాత గా, కొరియోగ్రాఫర్ గా, రచయిత గా కూడా ఆయన సినిమాలు తీశారు. అంతే కాదు లిరిక్ రైటర్ కూడా. అలాగే సింగర్ గా కూడా పాటలు పాడారు. ఇక అప్పుడప్పడూ తన సినిమాలకు డైలాగులు కూడా రాసేస్తారు. ఇలా క‌మ‌ల్ హాసన్ ఇండస్ట్రీ లో చాలా విభాగాల్లో తన ప్రతిభ చాటుకుంటున్నారు. ఇక విక్రమ్ బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ స్పీడ్ పెంచి వరుసగా భారీ సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నార. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు లైన్లో పెట్టారు. ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ‘థ‌గ్ లైఫ్’ మూవీ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి కమల్ కి సంబంధించి తాజా వార్త వచ్చింది. ఈ సినిమా కోసం కూడా క‌మ‌ల్ హాసన్ కూడా క‌లం ప‌ట్టారు.

రెండు గంటల్లో పాట..

ఇక థగ్ లైఫ్ సినిమా కోసం మ‌ణిర్న‌తంతో క‌లిసి స్టోరీ సిద్దం చేసారు కమల్. తాజాగా ఈ సినిమాకి కమల్ హాసన్ గీత ర‌చ‌యిత‌గానూ మారిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం లేటెస్ట్ గా ఆయ‌న ఓ పాట రాసారట. అయితే కమల్ హాసన్ ఇంతకు ముందు సినిమాల్లో కూడా కొన్ని పాటలు రాయడం జరిగింది. అయితే ఇక్క‌డ పాట రాయ‌డం విశేషం కాదు. ఆ పాట‌ను కేవలం రెండు గంట‌ల్లో రాసి, రికార్డింగ్ కూడా పూర్తి చేయ‌డం సంచ‌ల‌నం. అవును ఇదంతా క‌మల్ రెండు గంట‌ల్లోనే పూర్తి చేసారు. ఇంత‌వ‌ర‌కూ క‌మ‌ల్ కెరీర్ లో ఇలాంటి రికార్డు లేదు. ఎన్నో సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసారు. ఏ సినిమా కోసం ఇంత వేగంగా ప‌నిచేయ‌లేదు. దీంతో ఇదో రికార్డుగా మారింది. ఇక క‌మ‌ల్ కి మ‌ణిర‌త్నంతో మంచి అండ‌ర్ స్టాడింగ్ కూడా ఉంటుంది. అందుకే `నాయ‌కుడు` లాంటి గొప్ప సినిమాని ప్రేక్ష‌కుల‌కు అందివ్వ‌గ‌లిగారు. అయితే ఆ త‌ర్వాత‌ ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేయ‌డానికి 3 ద‌శాబ్ధాల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుందని అనుకోలేదు.

వరుస ప్రాజెక్టులతో బిజీ..

ఇక కమల్ హాసన్ (Kamal Hasan) నటిస్తున్న ‘థ‌గ్ లైఫ్’ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. పాన్ ఇండియాలో ఈ సినిమా సంచ‌ల‌న చిత్రమ‌వుతుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రోమోలు మంచి హైప్ ని తీసుకొచ్చాయి. 70 ఏళ్ల వ‌య‌సులోనూ క‌మల్ ఎక్క‌డా తగ్గట్లేదు. ఇక ఈ చిత్రాన్ని క‌మ‌ల్ త‌న సొంత నిర్మాణ సంస్థ రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ పైనే నిర్మిస్తున్నారు. ఇదే సంస్థ‌లో ఇత‌ర హీరోల‌తో క‌మ‌ల్ సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `కల్కీ 2898AD` లోనూ కీల‌క పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ కి సంబంధించి లుక్స్ రాగా, అలాగే అమితాబ్ బచ్చన్ పాత్ర గురించిన టీజర్ కూడా వచ్చేసింది. ఇక ఇప్పుడు కమల్ హాసన్ కి టీజర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు