Nithin : నితిన్ కోసం నిర్మాతల భారీ రిస్క్? మార్కెట్ కి డబుల్ ఖర్చు?

Nithin : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో డైలమా లో పడ్డాడు. ఒకప్పుడు క్రేజీ హిట్ సినిమాలతో మీడియం రేంజ్ హీరోల్లో ఒకడిగా సత్తా చాటిన నితిన్ వరుస పరాజయాలతో మార్కెట్ పరంగా చాలా దెబ్బ పడింది. నిజం చెప్పాలంటే ఎనిమిదేళ్ల కింద వచ్చిన అఆ సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాలేదని చెప్పాలి. మధ్యలో భీష్మ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే గత కొంతకాలంగా రొటీన్ స్క్రిప్ట్ ల వల్లే ఈ డిజాస్టర్లు పడుతున్నాయన్న విషయం తెలుసుకున్న నితిన్, ఇప్పుడు ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసితో భీష్మ తో హిట్ ఇచ్చిన వెంకీ తో చేయి కలిపి “రాబిన్ హుడ్” మూవీ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఆకట్టుకోగా, కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ దొంగగా నటిస్తున్నాడు. దీంతో పాటే నితిన్ దిల్ రాజు ప్రొడక్షన్ లో “తమ్ముడు” అనే పేరుతోనూ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

మార్కెట్ కి డబుల్ అవుతున్న బడ్జెట్..

అయితే నితిన్ (Nithin) హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా ఆల్మోస్ట్ డెబ్బై శాతం షూటింగ్ పూర్తయిపోగా, ఆ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లకు అనుకున్నదానికన్నా ఎక్కువ బడ్జెట్ అయిందట. ఇంతకు ముందు కూడా కొన్ని కీలక సన్నివేశాలకు అలాగే పరిమితి దాటిపోయిందని సమాచారం. అయితే మేకర్స్, ఒక్క సీన్ కదా అని దాటుకుంటూ, చాలా షెడ్యూల్స్ లో ఎక్కువ బడ్జెట్ పెట్టేశారట. దాదాపు ఇప్పుడు రాబిన్ హుడ్ కి 70 కోట్ల బడ్జెట్ అవుతుందిట. ఇది నితిన్ మార్కెట్ కి రెండు రెట్లు. మరి ఇంత భారీ బడ్జెట్ కి న్యాయం జరగాలంటే, మూవీ సాలిడ్ గా ఉండాలి. ఇక దీంతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు సినిమాకి కూడా బడ్జెట్ ఓ రేంజ్ లో పెరిగిపోతోందట. రీసెంట్ గా అడవి బ్యాక్ డ్రాప్ లో ఓ భారీ ఫైట్ సీన్ ని చిత్రీకరిస్తుండగా దానికే 10 కోట్ల ఖర్చవుతుందట. ఇక ఈ సినిమాకి కూడా దాదాపు రిలీజ్ దగ్గరయ్యే సరికి 70 కోట్ల బడ్జెట్ దాటిపోనుందని సమాచారం.

నాన్ థియేట్రికల్ రైట్స్ పై ఆధారపడాల్సిందేనా?

అయితే నితిన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు ఇంత బడ్జెట్ అవుతుందని బహుశా ఊహించలేదేమో. ఇప్పటినుంచైనా లిమిట్స్ దాటకుండా షూటింగ్ చేస్తే, కొంచెం అయినా కవర్ చేయొచ్చని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే నితిన్ మార్కెట్ ని ఎప్పుడో మించిపోయిన ఈ రెండు సినిమాల బడ్జెట్ కి సమతుల్యం చేకూరాలంటే నాన్ థియేట్రికల్ రైట్స్ భారీగా జరగాల్సి ఉంటుంది. ఎలాగూ నితిన్ సినిమాలకు ఆ డిమాండ్ బాగానే ఉంటుంది. కానీ వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్ కి నాన్ థియేట్రికల్ రైట్స్ బాగా జరగడంతో పాటు, థియేటర్ బిజినెస్ కూడా బాగా జరగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు నితిన్ కి ఒక సాలిడ్ కం బ్యాక్ హిట్ పడాలి. ఇక ఈ సినిమాల బడ్జెట్ ని బట్టి చూస్తే ఓ 100 కోట్ల బ్లాక్ బస్టర్ పడాలి అనేలా ఉంది పరిస్థితి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు