Krishnamma : కృష్ణమ్మ కోసం దిగ్ధర్శకులు.. అంత విషయముందా?

Krishnamma : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సత్యదేవ్ ఒకరు. కేవలం హీరోగానే కాకుండా, బడా స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తూ, అవసరమైతే ప్రతినాయక పాత్రలు కూడా చేస్తూ విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. ఇక తాజాగా సత్యదేవ్ హీరోగా నటించిన తాజా చిత్రం “కృష్ణమ్మ” రిలీజ్ కి రెడీ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కృష్ణమ్మ సినిమా టీజర్ ఈ మధ్యనే రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సత్యదేవ్ కెరీర్ లో ఇదో డిఫరెంట్ మూవీగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇక వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పిస్తున్న ఈ మూవీకి కాలభైరవ సంగీతం అందించారు. ఇదిలా ఉండగా కృష్ణమ్మ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ఏకంగా ఐదుగురు స్టార్ డైరెక్టర్లు హాజరుకానున్నారని తెలుస్తుంది.

స్టార్ డైరెక్టర్లు ఒకే వేదికపై..

ఇక సత్యదేవ్ హీరోగా నటించిన కృష్ణమ్మ మూవీ మే 10న రిలీజ్ కానుండగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి, క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌తో పాటు మరో ముగ్గురు స్టార్ డైరెక్టర్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‍లో పాల్గొననున్నారు. హైదరాబాద్‍లోని హైటెక్ సిటీ ట్రైడెంట్ హౌటల్‍లో మే 1 సాయంత్రం 6 నుంచి ఈవెంట్ ఉండనుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. కృష్ణమ్మ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు దర్శకధీరుడు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే, స్టార్ డైరెక్టర్లు సుకుమార్, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని కూడా చీఫ్ గెస్టులుగా రానున్నారు. ఒకే వేదికపైకి ఐదుగురు స్టార్ డైరెక్టర్లు రానున్నారు. దీంతో కృష్ణమ్మ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. తెలుగు సినిమాలో ఇది గ్రాండెస్ట్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అని కృష్ణమ్మ మేకర్స్ ట్వీట్ చేశారు. ఈ ఈవెంట్‍కు బ్లాక్‍బస్టర్ డైరెక్టర్లు వస్తున్నారని ఈ విషయాన్ని వెల్లడించింది అరుణాచల క్రియేషన్స్.

మూవీలో అంతుందా?

ఇక కృష్ణమ్మ (Krishnamma) సినిమా కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఇంతమంది వస్తున్నారంటే సినిమాలో అంత విశేషముందా అని నెటిజన్లు అరా తీస్తున్నారు. అయితే టీజర్ చూస్తుంటే మరీ అంత కొత్తగా అయితే ఏమి లేదు. మరి దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో థియేటర్లోనే చూడాలి. ఇక గత కొంత కాలంగా వరుస ప్లాపులతో ఉన్న సత్యదేవ్ సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై మళ్లీ హీరోగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో అర్చనా అయ్యర్, అతిరా రాజ్, కృష్ణ బూర్గుల, లక్ష్మణ్ మీసాల ఈ మూవీలో కీ రోల్స్ లో నటించారు. ఇక కృష్ణమ్మ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 10వ తేదిన రిలీజ్ కానుంది. మరి ఏకంగా ఐదుగురు స్టార్ డైరెక్టర్లు ముఖ్య అతిథిలుగా వస్తున్న ఈ సినిమాలో అంత విషయమేముందో తెలుసుకోవాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు