Krishnamma : ఈ సినిమా అయిన బ్రేక్ ఇస్తుందా?

Krishnamma : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ ఒకరు. చాలామందిలానే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ముందుగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తూ జ్యోతిలక్ష్మి సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా గా సక్సెస్ సాధించి పోయిన కూడా, మంచి ప్రశంసలను రాబట్టుకుంది. ప్రముఖ రచయిత మల్లాది రాసిన ఒక పుస్తకాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని పూరి జగన్నాథ్ ఈ కథను రాసుకున్నాడు.

ఇకపోతే ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా కూడా సినిమాలను చేస్తూ వచ్చాడు. సత్యదేవ్ చేసిన కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి. కానీ సత్యదేవ్ కి బ్రేక్ ఇచ్చిన ఫిలిం అంటూ ఇప్పటివరకు ఏదీ లేదు అని చెప్పాలి. గోపి గణేష్ దర్శకత్వంలో వచ్చిన బ్లఫ్ మాస్టర్ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ థియేటర్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించలేకపోయింది. ఆ తర్వాత సత్యదేవ్ చాలా సినిమాలను చేశాడు. అయితే మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా నటించాడు సత్యదేవ్. ఈ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.

ఆ తర్వాత సత్యదేవ్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఇకపోతే ప్రస్తుతం సత్యదేవ కృష్ణమ్మ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు అనౌన్స్ చేశారు మళ్లీ దీని గురించి ఇప్పటివరకు ప్రస్తావన లేదు. ఈ సినిమా గురించి దాదాపు ప్రేక్షకులు కూడా మర్చిపోయారు అని చెప్పొచ్చు. ఈ తరుణంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్ ఈ సినిమాను మే 3న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

- Advertisement -

సత్యదేవ నటిస్తున్న ఈ సినిమాకి గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను కొరటాల శివ ప్రజెంట్ చేస్తున్నారు. కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లిమ్స్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇదొక రస్టిక్ డ్రామాగా ఉండబోతుంది. ఇది యాక్టర్ గా సత్యదేవ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది అంటూ ప్రొడ్యూసర్ కృష్ణ కమలపాటి చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకు కృష్ణమ్మ అనే టైటిల్ ని ఎందుకు పెట్టారని ప్రేక్షకులకు ఒక క్లారిటీ వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా ఫ్రెండ్షిప్ గురించి ఉండబోతుందంటూ తెలిపారు. ఈ సినిమాలో లక్ష్మణ్ మీసాల, కృష్ణ అర్చన,నంద గోపాల్ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.

ఇకపోతే నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకొని తన టాలెంట్ ఏంటో తెలుగు ప్రేక్షకులకు తెలిపాడు సత్యదేవ్. అయితే టాలెంట్ ఉండి కూడా సరైన బ్రేక్ రాలేదు. కథల విషయంలో కూడా సత్యదేవ్ కి సరైన జడ్జిమెంట్ లేదు అనేది కొంతమంది అభిప్రాయం. ఏదేమైనా కృష్ణమ్మ ( Krishnamma ) సినిమా సత్యదేవ్ కి మంచి బ్రేక్ ఇస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తను కూడా ఇప్పుడున్న యంగ్ హీరోస్ కి పోటీగా నిలబడతాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు