Prasanna Vadanam : సినిమా ఎలా ఉన్నా.. దర్శకుడిపై ప్రశంసలు.. త్వరలోనే బడా నిర్మాతల ఛాన్సులు?

Prasanna Vadanam : టాలీవుడ్ లో ఈ వారం రెండు తెలుగు సినిమాలు రిలీజ్ కాగా, అందులో సుహాస్ హీరోగా నటించిన “ప్రసన్నవదనం” సినిమా ఒకటి. ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. తాజాగా థియేటర్లలో రిలీజ్ అయిన ప్రసన్నవదనం ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు అర్జున్ YK దర్శకత్వం వహించాడు. క ప్రసన్నవదనం సినిమా టీజర్, ట్రైలర్ దశ నుంచే ఆసక్తి రేపుతూ వచ్చింది. ప్రమోషన్లు కూడా బాగానే చేశారు. అయితే థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రంగా ఉంది. కానీ అందరి నోటా కామన్ గా దర్శకుడు కొత్త కథ తో మంచి ప్రయత్నమే చేసాడు. అతనికి మంచి ఫ్యూచర్ ఉంది అని అంటున్నారు. ఇక ప్రసన్నవదనం సినిమా టాక్ ఈ విధంగా ఉంది.

ఒకసారి కథ విషయానికి వస్తే..

సినిమాలో హీరో ఒక రేడియో ఆర్జేగా పని చేస్తుంటాడు. ఒక యాక్సిడెంట్ లో గాయపడి ఎదుటి వాళ్ళ మొహాలు గుర్తుపట్టలేని ఫేస్ బ్లైండ్ నెస్ జబ్బుకు గురవుతాడు. ఈ క్రమంలో రాత్రిపూట ఓ అమ్మాయి హత్యని కళ్లారా చూస్తాడు. తీరా చూస్తే ఆ కేసు హీరోపైనే పడుతుంది. అదొక్కటే కాకుండా ఊహించని సంఘటనలు జరిగి సూర్య ఏకంగా వివిధ మర్డర్ కేసుల్లో ఇరుక్కుంటాడు. చనిపోయిన యువతీ ఎవరు, ఈ వలయం నుంచి సూర్య ఎలా బయటికి వచ్చాడనేది స్టోరీ. ఇక దర్శకుడు అర్జున్ వైకె ఇప్పటిదాకా రాని ఒక డిఫరెంట్ పాయింట్ ని తీసుకోవడం బాగుంది. ఫేస్ బ్లైండ్ నెస్ వాస్తవంగా ఉన్నదే అయినప్పటికీ ఇప్పటిదాకా ఏ రచయితకు దీని మీద సబ్జెక్టు రాయాలన్న ఆలోచన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అర్జున్ ఇది ఎంచుకోవడంలోనే తన అభిరుచి ఏంటో చెప్పాడు. అయితే టైటిల్ కార్డు దగ్గరి నుంచి స్ట్రెయిట్ గా అసలు పాయింట్ లోకి వెళ్ళిపోయిన దర్శకుడు అర్జున్ ఆ తర్వాత రొటీన్ ట్రాక్ లోకి వచ్చేస్తాడు. బోరింగ్ స్క్రీన్ ప్లే తో కాస్త సాగదీసాడు. సినిమాపై మిశ్రమ స్పందన రావడానికి ఒక కారణం ఇదే.

దర్శకుడిపై ప్రశంసలు.. త్వరలో బడా చాన్సులు..

అయితే సినిమా(Prasanna Vadanam)లో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఎందుకంటే మూవీ లో కిల్లర్ ఎవరో మొదటి సగంలోనే ఓపెన్ గా చెప్పేసిన అర్జున్ ఇంకో గంటకు పైగా సస్పెన్స్ ఎలిమెంట్ లేకుండా నడిపించడం వల్ల కొంత ల్యాగ్ వచ్చేసింది. అయితే మొత్తానికి దర్శకుడు అర్జున్ వైకెలో విషయముందని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ప్రమోషన్స్ లో ఇతను తన దగ్గర మానేశాకే తాను లాజిక్స్ ఆలోచించడం ఆపేశానని చెప్పిన సుకుమార్ మాట నిజమే అనిపిస్తుంది. కాకపోతే ప్రతిభను ఇంకా సానబెట్టుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బోలెడు థ్రిల్లర్లు ఓటిటిలో పలకరిస్తున్న ట్రెండ్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసేలా తక్కువ బడ్జెట్ సినిమాలు తీయాలంటే ప్రసన్నవదనం లాంటి కాన్సెప్ట్స్ కరెక్టే. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు అర్జున్ వైకె కి వరుస ఛాన్సులు రావడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా బడా నిర్మాతల కన్ను ఇతని పై పడిందని సమాచారం. మరి ప్రసన్నవదనం ఓవరాల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు