Prasanna Vadanam Movie Review : ప్రసన్నవదనం మూవీ రివ్యూ

Prasanna Vadanam Movie Review : ఒక ఓటీటీ హిట్, రెండు థియేట్రికల్ సక్సెస్ లతో ఫామ్లో ఉన్నాడు సుహాస్. అతనితో రూ.10 కోట్లలో సినిమా తీస్తే మినిమమ్ గ్యారెంటీ అని టాలీవుడ్ దర్శకనిర్మాతలు భావిస్తున్న రోజులివి. ఇలాంటి టైంలో వచ్చిన ‘ప్రసన్నవదనం’ సినిమా వారి ఆశలను పదిలంగా ఉంచిందా? సుహాస్ సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసిందా? లేక ప్రేక్షకులను నిప్పించిందా? అనే విషయాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

సూర్య(సుహాస్) ఓ రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోతాడు. అదే టైంలో ఇతనికి ఫేస్ బ్లైండ్ నెస్ అనే డిసార్డర్ వస్తుంది. అంటే ఇతను ముఖాలను గుర్తుపట్టలేడన్న మాట. అయితే ఒకసారి అమృత(సాయిశ్వేత) అనే అమ్మాయిని కొందరు లారీ కిందకు తోసి హతమారుస్తారు. దీన్ని సూర్య కళ్లారా చూస్తాడు. కానీ మరుసటి రోజు ఇది యాక్సిడెంట్ అని కేసుని క్లోజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ న్యూస్ చూసి సూర్య షాక్ కి గురవుతాడు. పోలీసులకి ఈ విషయాన్ని చెప్పి న్యాయం చేయాలని చూస్తాడు. కానీ ఇది అతనికి బోలెడన్ని ప్రమాదాలు తెచ్చిపెడుతుంది. అవి ఏంటి? అసలు అమృత ఎవరు? ఆమెను మర్డర్ చేసింది ఎవరు? సూర్య ఆమెకు న్యాయం జరిగేలా చూసాడా లేదా అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ :

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఎక్కువగా తమిళ, మలయాళ భాషల్లోనే రూపొందుతాయి. ఒకవేళ తెలుగులో తీసినా అవి ఆడవు అనే కంప్లైంట్ ఇక్కడ ఎప్పుడూ ఉంది. కానీ టేకింగ్ బాగుంటే అలాంటి అనుమానాలు పటాపంచలు అవుతాయి అనేది వాస్తవం. సుకుమార్ శిష్యులకి మాత్రమే ఇలాంటి గొప్ప థాట్స్ వస్తాయా? లేక ఎక్కడైనా చూసి గొప్ప స్టోరీలు కాపీ కొడతారా? అనేది చాలా మందికి ఉన్న డౌట్. డైరెక్టర్ అర్జున్ ‘ప్రసన్నవదనం’ ఐడియాని డిజైన్ చేసిన విధానం బాగుంది.సుహాస్ హీరో కాబట్టి అందరూ కథ పై ఫోకస్ పెడతారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజ్ చేశాడు.

- Advertisement -

కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది అని చెప్పాలి. రిపీటెడ్ గా కొన్ని సన్నివేశాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కథ ముందుగు జరగడం లేదు. ఫస్ట్ హాఫ్ హ్యాంగోవర్ నుండి బయటపడటానికి దర్శకుడు ఎంతో టైం తీసుకోలేదు అనిపిస్తుంది. క్లైమాక్స్ సో సో గా లాగించేశాడు. మొత్తంగా సెకండాఫ్ ఆసక్తికరంగా నడవదు. సినిమాకి అదే మైనస్ అని కూడా చెప్పాలి. ఇక సాంకేతికంగా చూసుకుంటే సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది. మ్యూజిక్ జస్ట్ ఓకే.

నటీనటుల విషయానికి వస్తే..

సుహాస్ బాగా నటించాడు. అతను కాబట్టి.. ‘ప్రసన్నవదనం’ సినిమా కథలో అందరూ లీనమవుతారు. అదే ఏ స్టార్ హీరోనో చేసుంటే వాళ్ళు డీవియేట్ అవ్వడం ఖాయం. అలా అని ఇది పూర్తిగా సుహాస్ క్రెడిట్ అని చెప్పలేం. ఇంకోరకంగా చెప్పాలంటే సుహాస్ ఈ పాత్రకి సెట్ అవ్వలేదు. తన బెస్ట్ ఇచ్చాడు కానీ ఈ పాత్రలో అతన్ని చూడటానికి ప్రేక్షకులు ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. హీరోయిన్లలో పాయల్ రాధాకృష్ణ ఓకే. కానీ రాశీ సింగ్ పాత్ర తేలిపోయింది. ఈ మధ్య సోషల్ మీడియాలో అమ్మడు చేసిన గ్లామర్ షోకి ఈ పాత్ర మైలేజ్ ఇవ్వలేకపోయింది అనే చెప్పాలి. వైవా హర్ష ఓకే. నవీన రెడ్డి మరోసారి గెస్ట్ అప్పీరెన్స్ టైపు రోల్ చేసి ఫర్నీచర్ టైపు అనిపించుకుంది. మిగిలిన నటీనటులు పర్వాలేదు అనేలా చేశారు. కానీ పెద్దగా లెన్త్ లేని పాత్రలు అవి.

ప్లస్ పాయింట్స్ :

కాన్సెప్ట్

ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

చివరిగా.. ప్రసన్నవదనం అంటే హ్యాపీ ఫేస్ అనేది అర్ధమట. కానీ ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సగం హ్యాపినెస్ తోనే థియేటర్ నుండి బయటకి వెళ్తారు. బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయ్యే రేంజ్లో లేదు పరిస్థితి.చూడాలి మరి ఏమవుతుందో.

రేటింగ్ : 2.25/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు