Sabari Movie Review : ‘శబరి’ మూవీ రివ్యూ

Sabari Movie Review : ‘క్రాక్’ ‘నాంది’ ‘వీరసింహారెడ్డి’ ‘హనుమాన్’ వంటి సినిమాలతో తెలుగులో స్టార్ అయిపోయింది నటి వరలక్ష్మీ శరత్ కుమార్.తమిళ అమ్మాయే అయినప్పటికీ ఆమెకు తెలుగులో ఉన్న క్రేజ్ తమిళంలో కూడా లేదు అనడంలో సందేహం లేదు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘శబరి’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి :

కథ :

సంజన(వరలక్ష్మీ శరత్) కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త అరవింద్(గణేష్ వెంకట్రామన్)ను వదిలేసి… కుమార్తె రియా (బేబీ నివేక్ష)తో స్నేహితురాలు సునయన వద్దకి వస్తుంది.సింగిల్ మదర్ కావడంతో పాప స్కూల్ ఫీజుల కోసం ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఫైనల్ గా ఉద్యోగం సంపాదిస్తుంది. అయితే సూర్య (మైమ్ గోపీ) అనే సైకో సంజనని చంపేసి ఆమె కూతుర్ని ఎత్తుకుపోవడాలని అనుకుంటాడు. విచిత్రం ఏంటంటే సూర్య ఇంట్లోనే సంజన అద్దెకు దిగుతుంది. మరోపక్క పాప కస్టడీ కోసం భర్తపై గెలవడానికి కోర్టులు చుట్టూ తిరుగుతుంది. ఆ టైంలో ఆమెకు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది? అదేంటి? అసలు సూర్య ..సంజనని చంపేసి ఆమె కూతుర్ని ఎందుకు ఎత్తుకెళ్లిపోవాలనుకుంటున్నాడు? సంజన గతం ఏంటి? అసలు ఆమె భర్తతో ఎందుకు విడిపోయింది? చివరికి సూర్యని ఎదిరించి తన కూతుర్ని ఎలా దక్కించుకుంది? ఈ ప్రశ్నలకి సమాధానమే ‘శబరి’ మిగిలిన కథ.

విశ్లేషణ :

ఓ సింగిల్ మదర్ జీవితాన్ని థ్రిల్లర్ నేపథ్యంలో చెప్పాలనుకోవడం దర్శకుడు అనిల్ కాట్జ్ కి వచ్చిన మంచి ఆలోచనగా చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ కాకుండా దీనిని ఓ ఎమోషనల్ డ్రామాగా చెప్పాలనుకుంటే.. ప్రేక్షకులు లాజిక్స్ కి పెద్దగా పనిచెప్పరు. కానీ థ్రిల్లర్ గా చెప్పాలి అనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే కూడా పగడ్బందీగా ఉండాలి. ‘శబరి’ లో లోపించింది అదే. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. ఇంటర్వెల్ బ్లాక్ ఓకే. మరీ ఓ రేంజ్లో లేదు కానీ జస్ట్ ఓకే. ఇక సెకండ్ హాఫ్ నుండి కథ ఇంకో టర్న్ తీసుకుంటుంది. హీరోయిన్ కి ఉండే సైకలాజికల్ సమస్య మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ సినిమాకి దగ్గరగా ఉంటుంది. పాప కోసం హీరోయిన్ పడే ఆవేదన .. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలు అన్నీ భూమిక ‘అనసూయ’ ని గుర్తుచేస్తాయి. అయితే కూతురి కోసం హీరోయిన్ క్లైమాక్స్ లో చేసే పోరాటం బాగుంటుంది. అక్కడ వచ్చే ట్విస్ట్ ను మాత్రం ఆడియన్స్ ముందే పసిగట్టేస్తారు అనేది వాస్తవం. స్క్రీన్ ప్లే అంత వీక్ గా ఉంది మరి. సాంకేతికంగా చూసుకుంటే .. ఇలాంటి కథకి నిర్మాత పెద్దగా బడ్జెట్ పెట్టాల్సిన పనిలేదు. ప్రతి ఫ్రేమ్లోనూ అది తెలుస్తుంది. గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. థ్రిల్లర్ సినిమాలకి అదే మెయిన్. ఇక్కడ అది కూడా మిస్ అయ్యింది . సినిమాటోగ్రఫీ ఓకే.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. వరలక్ష్మీ బాగా చేసింది. ఆమె టాలెంట్ ఈ సినిమాతో మరోసారి బయటపడింది. తన వరకు పూర్తి న్యాయం చేసింది. అందులో ఎలాంటి సందేహం లేదు.ఆ తర్వాత మైమ్ గోపి చాలా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో అతని నటన ప్రత్యేకంగా ఉంటుంది భయపెడుతుంది అని కూడా చెప్పొచ్చు. శశాంక్ హీరోయిన్ ఫ్రెండ్ రోల్లో ఓకే అనిపించాడు. గణేష్ వెంకట్రామన్ నటించిన ఏ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడం లేదు. అదేంటో తెలీదు. పైగా అతన్ని గెస్ట్ విలన్ గానే ఎక్కువ చూపిస్తున్నారు. ‘శబరి’ లో కూడా అతని పాత్ర పెద్ద గొప్పగా ఉండదు. నటన కూడా అంతే..! పోలీస్ రోల్లో మధు, హీరోయిన్ ఇంకో ఫ్రెండ్ రోల్లో సునయన ఓకే. చిన్న పాత్రలో భద్రమ్ బాగానే చేశాడు. మిగిలిన నటీనటులు పెద్దగా గుర్తుండరు.

ప్లస్ పాయింట్స్ :

స్టోరీ లైన్
వరలక్ష్మీ

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
మ్యూజిక్

మొత్తంగా.. ‘శబరి’ ఓ బోరింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ. థియేటర్లో కూర్చుని చూడాలి అంటే చాలా ఓపిక కావాలి

రేటింగ్ : 2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు