Ghilli : గిల్లి రీ రిలీజ్ ఫైనల్ కలెక్షన్స్.. ఇప్పట్లో ఏ హీరోకి సాధ్యం కాదు!

Ghilli : సినిమా ఇండస్ట్రీ లో గత కొంత కాలంగా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోందన్న విషయం తెలిసిందే. తెలుగులో పోకిరి, ఖుషి, ఆరెంజ్ లాంటి బడా హీరోల సినిమాలే కాదు ఈ నగరానికి ఏమైంది అనే చిన్న సినిమాలు, ఆఖరికి డబ్బింగ్ సినిమాలు కూడా ఈ మధ్య ఇరగదీసాయి. ఇక ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఈ రీ రిలీజ్ సినిమాల జోరు ఊపందుకుంది. మొన్న ధనుష్ విఐపి, నిన్న రజినీకాంత్ పడియప్ప సినిమాలు రీ రిలీజ్ లో మంచి కలెక్షన్లు వసూలు చేయగా, తాజాగా విజయ్ గిల్లి సినిమా ఓ రేంజ్ లో భీభత్సమైన వసూళ్లు సాధించింది. మామూలుగా ఇప్పటివరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాల రిజల్ట్ ని బట్టి గమనిస్తే.. ఒక రీ రిలీజ్ మూవీ అయితే ఆ సినిమాకి మహా అయితే ఒకటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ వస్తాయి.. లేదా వీకెండ్ లో వరకు ఆడియన్స్ ఆదరిస్తారు. సినిమాలేవీ రిలీజ్ లేకపోతే వర్కింగ్ డేస్ లో కూడా ఓ మోస్తరు కలెక్షన్లు వస్తాయి. ఈ రోజుల్లో వర్కింగ్ డేస్ లో కొత్త సినిమాలే హోల్డ్ చేయని పరిస్థితులు ఉన్నాయి, అలాంటిది రీ రిలీజ్ మూవీ వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేయడం, తర్వాత కొత్త సినిమాలను కూడా డామినేట్ చేస్తూ రెండో వీక్ లో జోరు చూపించి సాలిడ్ గా హోల్డ్ చేయడం మామూలు విషయం కాదు. విజయ్ తలపతి గిల్లి మూవీ ఇదే జోరు చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వారాల పాటు దుమ్ములేపింది.

అన్ని రికార్డులు మటాష్..

ఇక విజయ్ దళపతి గిల్లి సినిమా సరిగ్గా రెండు వారాల కింద రీ రిలీజ్ కాగా, ఫస్ట్ డే నే రీ రిలీజ్ మూవీస్ లో అల్ టైం రికార్డ్ కలెక్షన్లు సాధించగా, ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తూ రచ్చ చేసింది. ఇక కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన సెన్సేషనల్ గిల్లి సినిమా రిలీజ్ అయి 20 ఏళ్ళు అయిన సందర్బంగా గ్రాండ్ రీ రిలీజ్ చేసారు మేకర్స్. ఇక ఈ సినిమా రెండు వారాల కింద భారీ రీ రిలీజ్ సొంతం చేసుకుని ఇప్పుడు ఏకంగా ఇండియన్ హిస్టరీలో ఏ రీ రిలీజ్ మూవీ సాధించని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఈ సినిమా విడుదలైన 9 రోజుల్లోనే 26.5 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా ఇప్పుగు రెండు వారాలు కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా హిస్టారికల్ 30 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని ఊహకందని ఊచకోత కోసింది సినిమా.

ఒకసారి 2 వారాల్లో గిల్లి మూవీ రీ రిలీజ్ కలెక్షన్స్..

తమిళనాడు 21.45 కోట్లు, కర్ణాటక 1.45 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా 0.90 కోట్లు, ఓవర్సీస్ 6.35 కోట్లు వసూలు చేయగా, టోటల్ వరల్డ్ వైడ్ గా 30.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని గిల్లి (Ghilli) రాబట్టి భీభత్సం సృష్టించింది. ఇక ఆల్ మోస్ట్ ఇవి కొత్త సినిమాల రేంజ్ వసూళ్లు అని చెప్పాలి. 20 ఏళ్ల క్రితం ఓల్డ్ మూవీ రీ రిలీజ్ లో ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మాములు విషయం కాదు. ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతున్న సినిమా ఈ వీకెండ్ లో తిరిగి జోరు చూపిస్తే లాంగ్ రన్ లో 35 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక త్వరలోనే విజయ్ గోట్ మూవీ రిలీజ్ కావడానికి సిద్ధం అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు