Gilli Movie Re release : గిల్లి మూవీ రీ రిలీజ్… ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

Gilli Movie Re release : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన గిల్లి మూవీ తాజాగా రీరిలీజ్ అయ్యింది. 2004లో ఈ మూవీ రిలీజ్ కాగా, అందులో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 20న మరోసారి విడుదలైంది. ఈ చిత్రానికి దళపతి ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మరి ఫస్ట్ డే ఈ మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసుకుందాం.

ఒక్కడు మూవీకి రీమేక్

తెలుగులో మహేష్ బాబు, భూమిక జంటగా నటించిన చిత్రం ఒక్కడు. 2003లో విడుదలైన ఈ హిట్ మూవీని 2004లో ‘ గిల్లి ‘ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఇందులో విజయ్ ‘శరవణ వేలు’గా నటించగా, ఆయన సరసన ధనలక్ష్మి పాత్రలో త్రిష నటించింది. మదురైలో, ముత్తుపాండి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పి చిత్రహింసలు పెడతాడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగున వచ్చిన ధనలక్ష్మిని వేలు కాపాడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది స్టోరీ.

ఫస్ట్ టైమ్ కలెక్షన్ ఎంత?

2004లో గిల్లి సినిమా రిలీజ్ కాగా భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే యాక్షన్, లవ్, కామెడీ, పాటలు ఇలా రకరకాల మసాలాలు మిక్స్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే దాదాపు 50 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు వసూలు చేసిన మొట్టమొదటి తమిళ చిత్రం ఇదే కాగా, ‘గిల్లి’ సక్సెస్‌తో బాక్సాఫీస్ పవర్‌హౌస్‌గా ఎరిగిన విజయ్ ఇప్పుడు సౌత్‌లోని ప్రముఖ నటుల్లో ఒకరిగా మారాడు. అంతేకాదు ఈ మూవీ థియేటర్లలో 200 రోజులకు పైగా నడిచింది.

- Advertisement -

రి రిలీజ్ తొలిరోజు కలెక్షన్లు..

గిల్లీ తొలిరోజు వసూళ్లు తమిళనాడులోనే దాదాపు రూ.6 కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ మూవీకి రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ ఉండగా, గిల్లి సినిమా రీ-రిలీజ్‌కి 24 గంటల కంటే తక్కువ సమయం ఉండగానే తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్‌లో ‘గిల్లి’ దాదాపు రూ. 3 కోట్లు రాబట్టిందని సమాచారం. వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ ఎత్తున ఓపెనింగ్స్ వచ్చేలా అవకాశం ఉంది . ఇక మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా గిల్లి కలెక్షన్లు రూ. 10 కోట్లకు పైగా ఉండవచ్చు అని అంచనా. అదే నిజమైతే ఈ మూవీ ఇప్పటిదాకా రీ-రిలీజ్‌అయిన సినిమాల్లో ఓపెనింగ్ రోజున అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించే అవకాశం ఉంది.

ఒక్కడు vs గిల్లి కలెక్షన్స్

ఒక్కడు మూవీ 9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా 11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ మూవీ 21.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక గిల్లి మూవీ కలెక్షన్ల విషయానికి వస్తే… 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో 31.50 కోట్లు కొల్లగొట్టింది. కేరళలో 4.20 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1. 50 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో ఈ మూవీ 5.50 కోట్లు సాధించింది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 42.70 కోట్ల గ్రాస్ రాబట్టింది గిల్లి మూవీ. అంతేకాకుండా 2004లో హైయెస్ట్ గ్రాసింగ్ తమిళ మూవీగా రికార్డును క్రియేట్ చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు