India’s Highest Paid Actress : నిమిషానికి 1 కోటి పారితోషికం తీసుకునే హీరోయిన్ ఎవరో తెలుసా?

India’s Highest Paid Actress : ఇండస్ట్రీలో హీరోయిన్లకు కలిసి వచ్చి స్థార్ డం వచ్చిందంటే ఆ తర్వాత వాళ్ళ సంపాదనను లెక్కపెట్టడం కూడా కష్టతరంగా మారుతుంది. అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో నయనతార లాంటి స్టార్ హీరోయిన్లు హయ్యెస్ట్ పారితోషకం అందుకుంటున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా నిమిషానికి కోటి రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. మరి ఇంతకీ ఈ రేంజ్ లో వసూలు చేస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు ? అనే వివరాల్లోకి వెళితే…

బాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరోయిన్ కి ఉండే పాపులారిటీ ఒక్కో రేంజ్ లో ఉంటుంది. అయితే హీరోయిన్ ఊర్వశి రౌతెల మాత్రం అందరికంటే భిన్నంగా ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆమె ఫాలోయింగ్, క్రేజ్ స్టార్ హీరోయిన్ల రేంజ్ లో ఉంటుంది. అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది ఈ హాట్ బాంబు.

తెలుగులో ఇన్ని సినిమాల్లో..

2023 సంక్రాంతి కానుకగా రిలీజైన వాల్తేరు వీరయ్య మూవీలో వేర్ ఈజ్ ది పార్టీ అంటూ బాస్ మెగాస్టార్ చిరంజీవితో చిందేసిన ఐటమ్ బ్యూటీ ఊర్వశి రౌతెల ఒక్కో నిమిషానికి కోటి రూపాయలు వసూలు చేస్తోందట. ఇక వాల్తేరు వీరయ్య మూవీలో ఆ ఒక్క సాంగ్ లో కనిపించడానికి ఈ బ్యూటీ రెండు కోట్లు పారితోషకంగా తీసుకుందని సమాచారం.

- Advertisement -

అయితే వాల్తేరు వీరయ్య మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఊర్వశికి టాలీవుడ్లో డిమాండ్ మరింతగా పెరిగింది. అందుకే బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటోంది. అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ తో పాటు బ్రో, స్కంద సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది ఈ చిన్నది. అయితే ఈ సినిమాలలో ఒక్కో స్పెషల్ సాంగ్ లో కనిపించడానికి మూడు నిమిషాలకే మూడు కోట్లు డిమాండ్ చేసిందట. అంటే నిమిషానికి కోటి రూపాయలు అన్నమాట.

సౌత్ స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువే

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లు సినిమా మొత్తానికి కలిపి కేవలం 10 కోట్లు డిమాండ్ చేస్తుంటే, ఈ బ్యూటీ మాత్రం నిమిషానికే కోటి రూపాయలు వసూలు చేయడం సంచలనంగా మారింది. 2013లో ఊర్వశి సింగ్ సాబ్ ది గ్రేట్ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత సనం రే, హేట్ స్టోరీ 4, పాగల్ పంతి వంటి సినిమాల్లో బోల్డ్ గా నటించి మెప్పించింది.

క్రేజ్ ఫుల్.. ఆఫర్లు నిల్

కేవలం తెలుగు, హిందీ భాషలోనే కాదు కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించింది ఊర్వశి. తమిళంలో ది లెజెండ్ మూవీలో, కన్నడలో మిస్టర్, ఐరావత అనే సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో మాత్రం ఈ అమ్మడికి కేవలం ఐటమ్ సాంగ్ ఆఫర్స్ రావడం గమనార్హం. కోటి రూపాయల పారితోషం అందుకుంటున్నప్పటికీ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న టాలీవుడ్లో హీరోయిన్ గా ఛాన్స్ మాత్రం కొట్టలేకపోయింది ఈ బీ టౌన్ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు