Sunny leone: భయపడడానికి సిద్ధం కండి.. శృంగారతార కామెంట్స్ వైరల్..!

Sunny leone.. ప్రముఖ నటి శృంగార తార సన్నీలియోన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఒకప్పుడు బోల్డ్ కంటెంట్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టి పెళ్లి చేసుకుంది.. బూతు సినిమాలలో నటించడం మానేశాక సిల్వర్ స్క్రీన్ పై అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. ఇక బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తోంది సన్నీ లియోన్. ఈ క్రమంలోనే తాజాగా “మందిర” అనే ఒక ప్రయోగాత్మక సినిమా చేస్తోంది. ప్రస్తుతం హార్రర్ కామెడీ కాన్సెప్ట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ జానర్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ.

Sunny leone:Get ready to be scared.. Shringarathara comments viral..!
Sunny leone:Get ready to be scared.. Shringarathara comments viral..!

భయపడడానికి సిద్ధం కండి..

ఇక సన్నీలియోన్ ప్రధాన పాత్రలో విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం మందిర.. ఈ చిత్రానికి ఆర్.యువన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ను మేకర్స్ వదిలారు. మందిర చిత్రానికి సంబంధించి టైటిల్ అలాగే సన్నీలియోన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.. ఇందులో సన్నీలియోన్ ను చూస్తే భయపెడుతూనే కవ్విస్తున్నట్టుగా కనిపిస్తోంది.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు కూడా చిత్ర బృందం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సన్నీ లియోన్ సినిమాలు..

గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె గతంలో మంచు విష్ణు హీరోగా వచ్చిన జిన్నా సినిమాలో చివరిగా నటించింది.. ఈ చిత్రంలో ఈమె పాత్రకు టాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు.. ఇక ఈ నేపథ్యంలోనే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తోంది సన్నీలియోన్..

- Advertisement -

సన్నీలియోన్ కెరియర్..

ఒకప్పుడు 37కు పైగా నీలి చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత 15కుపైగా చిత్రాలకు దర్శకురాలిగా పనిచేసింది.. అంతేకాదు నిర్మాతగా కూడా పలు చిత్రాలకు వ్యవహరించింది సన్నిలియోన్. ఇక హాలీవుడ్ నీలి చిత్ర ప్రపంచంలో ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన ఈమె జిస్మ్ 2 అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.ఇక మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంటు తీగ సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత పలు హిందీ సినిమాలలో నటించిన ఈమె కండోమ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేసింది.. ఇక హిందీలో ఈమె నటించిన సినిమాల విషయానికి వస్తే.. ఏక పహేలీ లీల, కుచ్ కుచ్ లోచా హై వంటి పలు హిందీ చిత్రాలలో నటించింది..

సన్నీ లియోన్ జీవిత విశేషాలు..

ఈమె భారత సంతతికి చెందిన సినీ నటి.. ఈమె తండ్రి టిబెట్ లో పుట్టినప్పటికీ ఢిల్లీలో పెరిగారు.. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13న జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు.. ఇక సన్నీ లియోన్ చిన్నతనంలోనే పాటలు పాడడం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్ వంటి వాటిల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు 1999లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా కూడా శిక్షణ తీసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు