Singer: 43 ఏళ్ల వయసులో ప్రముఖ సింగర్ ప్రెగ్నెంట్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్..!!

Singer.. ప్రముఖ సింగర్ సునీత తన గాత్రంతో ఎంతోమంది శ్రోతలను మైమరిపిస్తూ ఉంటుంది. సినిమా కెరియర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకున్న ఈమె వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శలు ఎదుర్కొంటూనే ఉందని చెప్పవచ్చు.. 19 ఏళ్లకే వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత అతి చిన్న వయసులోని భర్తకు విడాకులు ఇచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ఆ సమయంలో ఆమె చూడని ఇబ్బంది లేదు అనడంలో సందేహం లేదు.. అప్పటికే పలు విమర్శలే కాదు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలను కూడా ఎదుర్కొంది. ఇదిలా ఉండగా పిల్లల కోరిక మేరకు గత రెండు సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం చేసుకుంది. అయితే అప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది.

Singer:Popular singer is pregnant at the age of 45.. Fans are uniting..!!
Singer:Popular singer is pregnant at the age of 45.. Fans are uniting..!!

సింగర్ సునీత ప్రెగ్నెంట్..

ఇది ఇలా ఉండగా తాజాగా ఈమె 43 ఏళ్ల వయసులో ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ వార్తలు రావడం ఇదేమి తొలిసారి కాదు.. ఇప్పటికే రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్న దగ్గర నుంచి ఈమె తల్లి కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ వార్తలకు గట్టిగానే సమాధానం చెబుతోంది సునీత. ఇప్పుడు మళ్లీ ఇదే వార్త తెరపైకి రావడం గమనార్హం.

ప్రెగ్నెంట్ రూమర్స్ పై గట్టి కౌంటర్..

గతంలో హైదరాబాద్ వేదికగా మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఈమె తాను ప్రెగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలకు గట్టిగా సమాధానం ఇచ్చింది.. ఇందులో భాగంగానే ఆమె మాట్లాడుతూ.. నేను ప్రెగ్నెంటా .. ? నాకే తెలియదు..? ఈ వార్తలు సృష్టించిన వారి ఆలోచన స్థాయికి సంబంధించిన విషయం.. నాకు కానీ నా జీవితానికి సంబంధించిన విషయమైతే కాదు అంటూ తనపై వచ్చిన విమర్శలకు పూర్తిస్థాయిలో గట్టిగా సమాధానం ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. అంతేకాదు ఈ కాన్సెప్ట్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతూనే ఈ వార్తలకు అడ్డుకట్ట వేసింది. అయితే ఇక ఈ వార్తలు మళ్లీ వినిపించవు అని అందరూ అనుకుంటుండగా.. మళ్లీ కొంతమంది ఈయన ప్రెగ్నెంట్ అంటూ వార్తలను వైరల్ చేస్తున్నారు.. అంతేకాదు దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

ఖండించినా తప్పలేదు..

ఇకపోతే తాజాగా మళ్లీ ఈ వార్త ఏ కోణంలో బయటకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ సునీతను టార్గెట్ చేస్తూ.. చేస్తున్న కామెంట్స్ ని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇకపోతే ఇప్పటికే ఎన్నోసార్లు తాను ప్రెగ్నెంట్ కాదు అంటూ ఖండించినప్పటికీ ఈ వార్తలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.. వీటిని ఖండించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ వార్తలకు మాత్రం బ్రేక్ పడడం లేదనే చెప్పాలి.. మళ్లీ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఈ వార్తలను సునీత ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఏది ఏమైనా కెరియర్ పరంగా సక్సెస్ ని చూస్తున్న ఈమె ఇలా వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొంటూ ఉండడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు