Chennai High Court on Ilaiyaraaja : ఇళయరాజా అంత గొప్పేమి కాదు… చెన్నై హై కోర్టు షాకింగ్ కామెంట్స్

Chennai High Court on Ilayaraja : ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో.. ఇంకాస్త ముందుకెళ్లి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అని మెన్షన్ చేసి గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. ముందు వరుసలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పేరు చెబుతారు అందరూ. కానీ, చెన్నై హై కోర్టు మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇళయారాజా అంత గొప్ప వారేమీ కాదు అంటూ ఓ కేసు విషయంలో వ్యాఖ్యానించింది. ఆ కేసు ఏంటి.. ఇంతకి చెన్నై హై కోర్టు ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్ధాం…

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజు సాంగ్స్ అంటే సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు. కొత్తవి పాతవి అనే తేడా లేకుండా ఇళయరాజా నుంచి వచ్చిన సాంగ్స్ అంటేనే చాలు చాలా మంది వినడానికి రెడీ అయిపోయారు. అందు కోసమే చాలా మంది ఈ సాంగ్స్ రైట్స్ ను తీసుకుని ఆడియన్స్ కు వినిపిస్తారు. అయితే వీటిని రెన్యూవల్ చేసుకోవడంలో కొన్ని కంపెనీలు ఆలస్యం చేస్తున్నాయట. దీంతో తీసుకున్న రైట్స్ గడువు ముగిసిన కొన్ని రికార్డింగ్ కంపెనీలకు ఇళయరాజా నుంచి కాపీ రైట్స్ కోరుతూ చెన్నై హై కోర్టులో పిటిషన్ వేవారు.

దీంతో ఆయా కంపెనీలు చెన్నై హై కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన చెన్నై హై కోర్టు… ఆయా రికార్డింగ్ కంపెనీలకు ఇళయరాజా పాటలను ఉపయోగించేకునే హక్కు ఉందని తీర్పు ఇచ్చింది. దీంతో ఇళయరాజా మరోసారి హై కోర్టులో ఈ తీర్పును సవాళ్ చేస్తూ పిటిషర్ వేశారు. ఈ నేపథ్యంలో ఇళయరాజా తరపున లాయర్… ఇళయరాజా గొప్పతనం గురించి కోర్టులో వివరించారు. సంగీతంలో ఇళయరాజాను మించిన వాళ్లు లేరు అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

దీంతో హై కోర్టు జస్టీస్ మహదేవన్ ఈ విషయంలో కలగ చేసుకుని… సంగీత త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ శ్యామ్ శాస్త్రీ, త్యాగ రాజర్, ముత్తు స్వామి దీక్షితర్ ల కంటే ఇళయరాజా అంత గొప్పవారేమీ కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సౌత్ ఇండిస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. కాగా, ఈ కేసు విచారణను ఈ నెల 24 కు కోర్టు వాయిదా వేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు