Top 10 Trending Movies on Netflix : నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాలు ఇవే

Top 10 Trending Movies on Netflix : దిగ్గజ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి రీసెంట్ గా ఎన్నో కొత్త సినిమాలు వచ్చాయి. మరి వాటిలో ఈ వారం టాప్ ట్రెండింగ్ లో ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ ల లిస్ట్ ఏంటో చూద్దాం.

సినిమాల్లో కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన లపాతా లేడీస్ మూవీ, వెబ్ సిరీస్ లో సంజయ్ లీలా బన్సాలి అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ ఈ వారం టాప్ 10 లో ట్రెండింగ్ లిస్ట్ లో ఉన్నాయి.

1. లపాతా లేడీస్

నెట్ ఫ్లిక్స్ తాజాగా మే నెల ఫస్ట్ వీకెండ్ లో తన ప్లాట్ ఫామ్ లో ఉన్న ట్రెండింగ్ సినిమాల లిస్టును రిలీజ్ చేసింది. అందులో హిందీ మూవీ లపాతా లేడీస్ నెంబర్ వన్ స్థానంలో ఉండడం విశేషం. ఈ చిన్న సినిమా థియేటర్లలో దుమ్ము రేపింది. ఇప్పుడు ఓటీటీలో కూడా అదే రేంజ్ లో దూసుకెళ్తోంది. ఒకరి భార్య ఇంకొకరికి మారిపోతే ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్నదే ఈ మూవీ స్టోరీ. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 26 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆ మరునాడే టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. అప్పటి నుంచి వారం మొత్తం అదే ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం.

- Advertisement -

2. టిల్లు స్క్వేర్

రెండో స్థానంలో టిల్లు స్క్వేర్ మూవీ దూసుకెళ్తోంది. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ మూవీ థియేటర్లలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డతో పాటు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీ మార్చ్ 29న థియేటర్లలోకి రాగా, ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి 2024 లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు మూవీస్ లో ఒకటిగా రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్ ఫ్లిక్స లో స్ట్రీమింగ్ అవుతుండగా, ఇప్పటికీ కూడా టాప్ 2 లో ట్రెండ్ అవుతుండడం విశేషం.

3. ఆర్టికల్ 370

జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని తొలగించిన సంఘటన చుట్టూ తిరిగే కథే ఆర్టికల్ 370. థియేటర్లలో ఈ మూవీకి మంచి రెస్పాన్సే వచ్చింది. యామి గౌతమ్, ప్రియమణి ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటించారు. మూడవ ప్లేస్ లో ఉంది ఆర్టికల్ 370.

4. డియర్

జివి ప్రకాష్ మరియు ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన డిఆర్ అనే తమిళ చిత్రంవిడుదలైన రెండు వారాల్లోనే OTTలో విడుదల కానుంది. ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఏప్రిల్ 28 న ఓటీటీలోకి అడుగుపెట్టింది.

5. అమర్ సింగ్ చంకీల

పంజాబీ సింగర్ అమర్ సింగ్ చంకీల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో దిల్జిత్ దోసంజ్, పరిణితి చోప్రా హీరో హీరోయిన్లుగా నటించారు. అమర్ సింగ్ చంకీల మూవీ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 12న రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

దంగే, ఎనీవన్ బట్ యుమ్, ఆల్ ఇండియా ర్యాంక్, ఫైటర్, సిటీ హంటర్ సినిమాలు టాప్ 6 నుంచి వరుసగా టాప్ 10 లిస్ట్ లో ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు