Guardian on OTT : ఆత్మ ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో చూపించే మూవీ… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Guardian on OTT : మనం ఇప్పటిదాకా ఎన్నో రివేంజ్ డ్రామాలు చూసాము. అలాగే హారర్ మూవీలు కూడా చూసాము. తాజాగా ఈ రెండింటిని మిక్స్ చేసి ఉన్న హన్సిక మూవీ ఓటిటిలోకి రాబోతోంది. మరి దెయ్యం రివేంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుందో తెలియ చెప్పే ఈ మూవీని ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే…

హన్సిక హీరోయిన్ గా నటించిన హారర్ రివేంజ్ డ్రామా గార్డియన్. శబరి గురు శరవణన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. కనీసం వారం కూడా ఆడకుండానే థియేటర్ల నుంచి అవుట్ అయింది. సినిమాలో చెప్పుకోవడానికి ఒక్క హన్సిక తప్ప హారర్ ఎలిమెంట్స్, కామెడీ, కథ కథనాలు ఒక్కటి కూడా బాగాలేవని నెగెటివిటీ వచ్చింది. ఈ సినిమాలో హన్సికతో పాటు సురేష్ చంద్ర మీనన్, శ్రీమాన్ కీలక పాత్రనలు పోషించారు.

అమెజాన్ ల్ చూడాలంటే వారం ఆగాల్సిందే..

ఇక ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి నెల రోజులు దాటిపోవడంతో హన్సిక అభిమానులు ఓటిటిలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. కానీ గార్డియన్ మూవీని ఓటీటీలో చూడాలంటే మరో వారం పాటు వెయిట్ చేయక తప్పదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ హారర్ రివేంజ్ డ్రామా మే 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం. ఇది తమిళ సినిమా కాగా, ఓటిటిలో మాత్రం తెలుగులో కూడా రిలీజ్ అవుతుందని నడుస్తోంది.

- Advertisement -

గార్డియన్ మూవీ స్టోరీ…

అపర్ణ అనే ఇంటీరియర్ డిజైనర్ ఓ ప్రమాదంలో గాయపడటంతో ఆమె జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆమెను ఆత్మ ఆవహించి పెద్ద మనుషులుగా చెలామని అవుతున్న కొంతమంది పై ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటుంది. ఇంతకీ ఆ ఆత్మ అపర్ణ శరీరంలోకే ఎందుకు ప్రవేశించింది? అసలు ఆ ఆత్మ స్టోరీ ఏంటి? దాని కారణంగా అపర్ణ ఎలాంటి చిక్కుల్లో పడాల్సి వచ్చింది? అన్న ఇంటరెస్టింగ్ పాయింట్స్ ను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

హన్సికకు బ్యాడ్ టైం…

పెళ్లయిన తర్వాత ఈ మిల్కీ బ్యూటీ కి పెద్దగా కలిసి రావట్లేదు. 2022 డిసెంబర్ లో తన ప్రియుడు, బిజినెస్ మెన్ సోహైల్ కతూరియాను హన్సిక పెళ్లాడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఓవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు సినిమాలపై దృష్టి పెడుతోంది. కానీ పెళ్ళయిన తరువాత ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మిగులుతున్నాయి. గత ఏడాది హన్సిక మై నేమ్ ఈజ్ శృతి అనే తెలుగు మూవీ, పార్ట్నర్ అని తమిళ మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అలాగే ఈ ఏడాది ఆమె నటించిన 105 మినిట్స్ మూవీ కూడా డిజాస్టర్ కావడంతో హన్సిక ఖాతాలో హ్యాట్రిక్ డిజాస్టర్ పడినట్టుగా అయ్యింది. ప్రస్తుతం ఆమె నాషా అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. మరి ఈ సిరీస్ తోనైనా ఆమె హిట్ అనుకుంటుందేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు