Aa Okkati Adakku Movie Review : ఆ ఒక్కటీ అడక్కు మూవీ రివ్యూ

Aa Okkati Adakku Movie Review : అల్లరి నరేష్ ‘నాంది’ నుండి సీరియస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. అది హిట్ అవ్వడంతో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ‘ఉగ్రం’ వంటి సినిమాలు చేశాడు. అవి నిరాశపరిచాయి. దీంతో మళ్ళీ తన కంఫర్ట్ జోన్ కి వచ్చి ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే కామెడీ సినిమా చేశాడు. నరేష్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ గారు అదే టైటిల్ తో గతంలో ఓ సక్సెస్ ఫుల్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. నరేష్ తన సినిమాకి ఆ టైటిల్ వాడుకోవడంతో ప్రేక్షకుల దృష్టి ఈ సినిమా పై పడింది. మల్లి అంకం దర్శకుడు కాగా ‘చోటాభీమ్’ వంటి యానిమేషన్ వర్కులు చేసే కంపెనీ అధినేత రాజీవ్ చిలక ‘చిలక ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. మరి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం పదండి :

కథ :

గణ అలియాస్ గణపతి (అల్లరి నరేష్) ఓ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతని తనపై వేసుకుని.. సెటిల్ అయ్యే వరకు పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అవుతాడు. మరోపక్క అతనికంటే అతని తమ్ముడు (బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ)కి, మేనమామ కూతురు దేవి (జేమీ లివర్) తో పెళ్లి జరిపిస్తాడు. వయసు ఎక్కువ అవుతుండటం పైగా తమ్ముడికి ముందుగా పెళ్లి అవ్వడంతో అతనికి అతనికి సంబంధాలు రావు. ఈ క్రమంలో స్నేహితుడి(వెన్నెల కిషోర్) సలహాతో మ్యాట్రిమోనీ సైట్ లో మెంబర్ షిప్ తీసుకుంటాడు? దాని ద్వారా సిద్ధి (ఫరియా అబ్దుల్లా) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత అతనికి ఎదురైన సంఘటనలు ఏంటి? మ్యాట్రిమోనీ సైట్ల మోసాలను అతను ఎలా తెలుసుకున్నాడు? ఎలా వారికి శిక్ష పడేలా చేశాడు? చివరికి సిద్ధితో గణ పెళ్లి అయ్యిందా? లేదా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

దర్శకుడు మల్లి అంకం ఓ మంచి కాన్సెప్ట్ ఎంపిక చేసుకున్నాడు. ఈ ఐడియాకి అతన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇలాంటి మంచి కాన్సెప్ట్ కోసం ‘ఆ ఒక్కటీ అడక్కు అనే క్లాసిక్’ టైటిల్ తీసుకున్నాడు. దానికి కూడా మెచ్చుకోవాలి. రాజీవ్ చిలక వంటి పెద్ద నిర్మాతని పట్టాడు. అది కూడా సూపర్. తొలి సినిమాకి ఇంత మంచి సెటప్ దొరికినప్పుడు టేకింగ్ కూడా ఆ రేంజ్లో ఉంటే బాగుండేది. మొదటి సీన్ నుండి సినిమా స్లోగా ‘సాగిన’ ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ కొంత ఫన్, ఇంటర్వెల్ ట్విస్ట్ వల్ల ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే చాలా లేజీగా అనిపిస్తుంది. దానికి తోడు ఆ ల్యాగ్ ఏదైతే ఉందో.. దాని వల్ల సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాత తప్పు ఏమీ లేదు. అతని ఈ సినిమాకి ఏం చేయాలో అది చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తక్కువయ్యాయి అనే ఫీలింగ్ కలిగించవు. సినిమాటోగ్రఫీ బాగుంది. రెండు పాటలు కూడా బాగున్నాయి. ఈ కాన్సెప్ట్ తో బోలెడంత కామెడీని పండించే స్కోప్ ఉన్నా దర్శకుడు ఆ స్టెప్ తీసుకోకుండా బోరింగ్ సీన్స్ , స్క్రీన్ ప్లే తో విసిగించాడు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. అల్లరి నరేష్ ఈ సినిమాలో తన మార్క్ కామెడీతో అలరిస్తాడు అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. చాలా ఇబ్బంది పడుతూనే ఈ సినిమాలో నటించాడు. ప్రతిసారి ఎమోషన్ పలకరించాల్సి వస్తే ఏ కామెడీ కింగ్ కి అయినా కష్టమే కదా. అది అల్లరి నరేష్ పాత్రలో స్పష్టంగా తెలుస్తుంది. హీరోయిన్ ఫారియా అబ్దుల్లా.. ఆల్మోస్ట్ హీరో అంత హైట్ ఉంది. కానీ ఆ పాత్ర ఆ రేంజ్లో లేదు. నటన పరంగా కూడా ‘జాతిరత్నాలు’ లో కనిపించిన ఎనర్జీ లెవెల్స్ కనిపించలేదు. వెన్నెల కిషోర్ రొటీన్ ఫ్రెండ్ రోల్ చేశాడు. కల్పలత కూడా రొటీన్ మదర్ రోల్ చేసింది. ‘బిగ్ బాస్’ ఫేమ్ రవి సీరియల్స్ లో ఎలా నటిస్తాడో అలాగే నటించాడు. అతని భార్య పాత్ర పోషించిన జేమీ లివర్ మాత్రం బాగా నటించింది. హీరోయిన్ కంటే కొన్ని సీన్స్ లో ఈమెనే హైలెట్ అనిపిస్తుంది. మిగిలిన నటీనటులు జస్ట్ అలా ఉన్నారంతే. తమ డైలాగులు చెప్పాల్సిన టైంలో చెప్పడానికి ఉన్నట్టు.

ప్లస్ పాయింట్స్ :

కాన్సెప్ట్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
సెకండ్ హాఫ్

మొత్తానికి ‘ఆ ఒక్కటీ అడక్కు’ మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ బ్యాడ్ డైరెక్షన్ వల్ల ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ కలిసొచ్చి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు ఏమైనా చేస్తుందేమో చూడాలి.

రేటింగ్ : 2/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు