Aa Okkati Adakku Twitter Review: మళ్లీ అదే జానర్ ని నమ్ముకున్న నరేష్.. కం బ్యాక్ ఇస్తాడా..?

Aa Okkati Adakku Twitter Review: గతంలో ఎక్కువగా కామెడీ చిత్రాలలో నటించి..ఆ తరం హీరోలలో తనకంటూ తిరుగులేని స్టార్ డంని అందుకున్నారు హీరో రాజేంద్ర ప్రసాద్.. ఆ తర్వాత అదే తరహా లో మళ్లీ అదే స్టార్ డం అందుకున్న హీరో అల్లరి నరేష్… అతి తక్కువ కాలంలోనే 50కి పైగా సినిమాలలో నటించిన అల్లరి నరేష్.. నిర్మాతలకు ఎన్నో చిత్రాలతో లాభాలను తెచ్చిపెట్టారు. అలాంటి సమయంలో అనుకోకుండా అల్లరి నరేష్ కు బ్యాడ్ లక్ ఎదురయింది.. తన కామెడీనీ ప్రేక్షకులను ఆస్వాదించడమే మానేశారు..

Aa Okkati Adakku Twitter Review:Naresh who believed in the same genre again.. will he come back..?
Aa Okkati Adakku Twitter Review:Naresh who believed in the same genre again.. will he come back..?

మళ్లీ అదే జానర్ లోకి..

అలా వరుసగా సినిమాలో ఫ్లాప్ అవడంతో.. ఒక్కసారిగా కామెడీ జోనర్ కి గుడ్ బై చెప్పేసి.. మరో కొత్త జానర్ లో చిత్రాలను చేశారు. అవి కూడా రెండు మూడు సినిమాలు వర్కౌట్ అయ్యాయి కానీ మళ్లీ వర్కౌట్ కాకపోవడంతో తిరిగి కామెడీ వైపు గానే అడుగులు వేశారు అల్లరి నరేష్.. ఆ ప్రయత్నంలోనే భాగంగా ఇటీవల ఆ ఒకటి అడక్కు అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. అల్లరి నరేష్ ఇందులో పెళ్ళి కాని ప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారు.. ముఖ్యంగా ఏజ్ బార్ అవుతున్నా..అమ్మాయి దొరకకపోవడంతో ఇబ్బందులు పడే యువకుడి పాత్రలో కనిపించారు. మరి ఏ మేరకు ఈ సినిమాతో అల్లరి నరేష్ మెప్పించారో చూద్దాం.

వయసు ముదురుతున్న పెళ్లి కానీ అబ్బాయిల నేపథ్యంలో..

ప్రస్తుతం సమాజంలో ఎక్కువగా అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి వేధిస్తున్న ఒక సమస్య కూడా.. ముఖ్యంగా యువకులకు పెళ్లి కాకపోవడం అనే సమస్యతో ఈ సినిమాని తెరకెక్కించారు.. ఆ ఒక్కటి అడక్కు సినిమా విషయానికి వస్తే.. ఫస్ట్ ఆఫ్ పరవాలేదు అనిపించుకున్నా .. డైరెక్టర్ పెళ్లిని బిజినెస్ గా మార్చేసే విధానం ..వాటి చుట్టూ జరిగిన పరిణామాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అల్లరి నరేష్ మరొకసారి పెళ్ళికాని ప్రసాద్ పాత్రలో బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లరి నరేష్ తన పాత్రకు 100% న్యాయం చేశారని కూడా చెప్పవచ్చు. డైరెక్టర్ చివరి అంకం వరకు అల్లరి నరేష్ ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్ర రాసినట్టుగా కనిపిస్తోందట.

- Advertisement -

నటన బాగున్న కథపరంగా మెప్పించలేదు..

హీరోయిన్గా ఫరియా అబ్దుల్లా కూడా తన క్యూట్ యాక్టింగ్ తో మరొకసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.. వెన్నెల కిషోర్, వైవాహర్ష వంటి కమెడియన్స్ కూడా తమ కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో కాస్త సీరియస్ నెస్ వైపుగా సినిమాని మళ్లించడంతో పాటు కొన్ని హాట్ సీన్స్, డైలాగులతో కథను మలుపు తిప్పారు.. అయితే చివరిలో క్లైమాక్స్ మాత్రం బాగుందని ఆడియన్స్ తెలియజేస్తున్నారు. మొత్తానికి పూర్తిస్థాయిలో అల్లరి నరేష్ నవ్వించలేకపోయారని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. పాటలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే కామెడీ సినిమాలు చూసేవారికి ఈ సినిమా కాస్త ఎంజాయ్ గా అనిపిస్తుంది.

నెటిజన్స్ ఏమంటున్నారంటే..

మొత్తానికైతే మళ్లీ పాత జానర్నే నమ్ముకున్న నరేష్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. కానీ ఆయనకు సరైన కథలు ఇవ్వకపోవడం వల్లే ఈ సినిమాతో కం బ్యాక్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదని సమాచారం.. మొత్తానికైతే ఓవర్సీస్ లో ఈ సినిమాని చూసిన నెటిజెన్స్ .. ఈ సినిమా కామెడీ చూసే వారికి మాత్రమే సెట్ అవుతుందని.. మిగతావారు పెద్దగా కనెక్ట్ కారుని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు